Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరితెగించేస్తున్న 'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు'... ఐనా పట్టించుకోవడంలేదట...

'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు' అంటే ఎవరు అనుకుంటున్నారా?? అదెవరో కాదండి.. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ అడ్వైర్టైజ్‌మెంట్‌లో వచ్చే నటీమణులు 'యామీ గౌతమ్', 'పూజా హెగ్డే'. ఇద్దరూ అందగత్తెలే అయినప్పటికీ వారు నటించిన సి

Advertiesment
బరితెగించేస్తున్న 'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు'... ఐనా పట్టించుకోవడంలేదట...
, శనివారం, 24 ఫిబ్రవరి 2018 (17:11 IST)
'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు' అంటే ఎవరు అనుకుంటున్నారా?? అదెవరో కాదండి.. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ అడ్వైర్టైజ్‌మెంట్‌లో వచ్చే నటీమణులు 'యామీ గౌతమ్', 'పూజా హెగ్డే'. ఇద్దరూ అందగత్తెలే అయినప్పటికీ వారు నటించిన సినిమాలు తగిన స్థాయిలో ఆడటం లేదు. కెరీర్ ప్రారంభంలోనే హిందీలో 'హృతిక్ రోషన్' ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామలకు చేదు అనుభవమే మిగిలింది. అందులో యామీ గౌతమ్ 'కాబిల్' అనే చిత్రంలో, పూజా హెగ్డే 'మొహెంజోదారో' అనే చిత్రాల్లో హృతిక్ సరసన నటించినప్పటికీ సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. 
 
తెలుగులోనూ అడపాదడపా నటించిన ఈ ముద్దుగుమ్మలకు ఇక్కడా చేదు అనుభవమే మిగిలింది. యామీ గౌతమ్ తెలుగులో 'కొరియర్‌ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నితిన్ సరసన నటించింది. పూజా హెగ్డే 'ముకుందా', 'ఒక లైలా కోసం' మరియు 'డీజే' సినిమాలలో కనిపించింది. పైగా 'డీజే' సినిమాలో బికినీ వేసి కుర్రకారుని ఊరించేసింది. ఆ సినిమాలో ఎక్స్‌పోజింగ్ శృతిమించిపోయిందంటే అతిశయోక్తి కాదు.
 
ఇన్ని చేసినా ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ దెబ్బకు పూజాకు సినిమాలు కరువై సినీ ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఇక యామీ గౌతమ్ అయితే ఏకంగా మగాళ్ల మేగజిన్ మ్యాక్సిమ్ కవర్‌ పేజీపై అర్థ నగ్నంగా ఫోజులిచ్చింది. ఈ భామలను ఆదుకునే నిర్మాతలు, దర్శకులు ఎవరోగానీ, ఇప్పుడైతే మాత్రం పూర్తిగా సినీ అవకాశాల కోసం ఇలా ఫోజులివ్వడంతో బీటౌన్‌తో పాటుగా అభిమానులు సైతం విస్తుపోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ "కాలా" టీజర్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్