Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సముద్రంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం?

ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామే

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (13:25 IST)
ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామేశ్వరంలో శనివారం కలిపినట్టు వార్తలు వచ్చాయి. 
 
దక్షిణాది హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అస్థికలను రామేశ్వరం తీరంలో ఉన్న బంగాళాఖాతంలో కలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలు తమ తల్లిని తలచుకుని విలపించారు. 
 
అయితే, ఈ వార్తలను అనేక మంది కొట్టిపారేస్తున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వచ్చిన బోనీ కపూర్ కుటుంబం.. చెన్నై ఈసీఆర్ రోడ్డులో ఉన్న శ్రీదేవికి సొంతమైన ఫామ్‌హౌస్‌లో బసచేశారు. 
 
ఈ ఇంటి వెనుక భాగంలో ఉన్న బంగాళా ఖాతంలోనే ఈ అస్థికలను నిమజ్జనం చేశారని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే. వారు నిమజ్జనం చేసిన సమయంలో తీసిన ఫోటో రామేశ్వరంలో తీసినది కాదనీ, శ్రీదేవి నివాసం వెనుకభాగంలో ఉన్న సముద్రం వద్ద తీసిందనే ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments