Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2లో సమంతకు బదులు శ్రీలీల.. డ్యాన్స్ ఇరగదీస్తుందా?

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (17:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌లోని ఊ అంటావా పాటలో తన నృత్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సమంతా రూత్ ప్రభు స్థానంలో శ్రీలీల రానుంది. పుష్ప సీక్వెల్.. పుష్ప 2: ది రూల్‌లో యువ నటి శ్రీలీల డ్యాన్స్ ఉన్నట్లు సమాచారం. సీక్వెల్‌లో శ్రీలీల ప్రత్యేక డ్యాన్స్ ఉంటుందని, శ్రీలీల పాట ద్వారా సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తీసుకురావాలని భావిస్తున్నారు.
 
పుష్ప: ది రైజ్‌లోని ఐటెమ్ నంబర్‌లో అత్యుత్తమ నటనకు పేరుగాంచిన సమంతా ఊ అంటావా పాటలో కనిపించినందుకు రూ.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే, పుష్ప-2లో డ్యాన్స్ నంబర్ కోసం శ్రీలీల ఎంపిక చేయబడిందని.. ఇందుకోసం రూ. 2 కోట్లు చెల్లించినట్లు టాక్ వస్తోంది.
 
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రూల్ ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, కార్తీక శ్రీనివాస్-రూబెన్ ఎడిటర్లుగా పనిచేస్తున్నారు.
 
పుష్ప-2లో శ్రీలీల ఐటమ్ గర్ల్‌గా ఇరగదీస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12, 2024న విడుదలైంది. ఈ చిత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments