Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీకి రాజీనామా చేసిన సినీ నటి జయసుధ

Advertiesment
jayasudha

ఠాగూర్

, గురువారం, 11 జనవరి 2024 (19:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే గోషామహల్ టికెట్ ఆశించి భంగపడిన విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
 
ఇపుడు సినీ నటి జయసుధ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆమె భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నంచి పోటీ చేయాలని భావించి, టిక్కెట్ కోసం యత్నించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మేకల సారంగపాణికి టిక్కెట్ కేటాయించింది. 
 
విమానంలో విండో సీటు కావాలా... రూ.2 వేలు చెల్లించాలి...
 
తమ ప్రయాణికులకు ప్రైవేట్ విమాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన విమానాల్లో విండో సీటు కావాలనుకునేవారికి ఓ ఆఫర్ ప్రకటించింది. విండో సీటు కావాలంటే రూ.2 వేలు చెల్లించాలని తెలిపింది. 
 
ప్రయాణికులకు సౌకర్యవంతంగా కాస్త ఎక్కువ 'లెగ్ రూమ్' ఉండే ముందు వరుస సీట్ల బుకింగ్‌పై రూ.2000 ఫిక్స్డ్ ఛార్జీ నిర్ణయించింది. ఇక విండో సీటు బుకింగుపై రూ.2000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో వెబ్‌సైట్ పేర్కొంది. 222 సీట్లు ఉండే ఏ321 విమానం ముందు వరుసలో విండో సీటు బుకింగుపై రూ.2000, నడక దారి సీటు బుకింగుపై రూ.1500, అదేవరుసలోని రెండో, మూడో సీట్ల బుకింగుపై రూ.400 ఛార్జీలు ఉంటాయని తెలిపింది. 232 సీట్లు ఉన్న ఏ321 ఫ్లైట్, 180 సీట్లు ఉన్న ఏ320 ఫ్లైట్‌పై కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. 
 
ప్రయాణికులు ఒకవేళ ప్రాధాన్య సీటు అవసరంలేదనుకుంటే ఛార్జీలు లేని సీటును ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ సమయంలో సీటును కేటాయిస్తారని ఇండిగో వెబ్సైట్ పేర్కొంది. కాగా ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. దేశీయ విమానయానరంగంలో 60 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం