Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ కుమార్తెగా నటించడం అదృష్టం : నటి లతాశ్రీ

Advertiesment
latha

ఠాగూర్

, శుక్రవారం, 12 జనవరి 2024 (12:38 IST)
latha
1990 దశకంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి లతాశ్రీ. 'ముద్దుల మేనల్లుడు', 'అబ్బాయిగారు', 'అల్లరోడు', 'ఆ ఒక్కటి అడక్కు', 'యమలీల' వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత నిదానంగా ఆమె నటనకు దూరమయ్యారు. అయితే ఆమె చేసిన కొన్ని పాత్రల కారణంగా ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.
 
తాజాగా తన సినీ కెరీర్‌, వ్యక్తిగత జీవితంపై ఆమె మాట్లాడుతూ, "కన్నడ నుంచి నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నప్పటికీ, మొదటి నుంచి కూడా తెలుగు పట్ల నేను ఆసక్తిని చూపిస్తూ వచ్చాను. అందుకు కారణం మా అమ్మగారేనని చెప్పాలి. 
 
ఇక ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డిలు మంచి పాత్రలనిచ్చి నన్ను ప్రోత్సహించారు. కృష్ణ సినిమాలు ఎక్కువగా చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తుంటాను అని చెప్పారు. 
 
అలాగే, 'చాలా సినిమాల్లో అవకాశాలు నా వరకూ వచ్చి చేజారిపోయేవి. 'మేజర్ చంద్రకాంత్'లో ఎన్టీఆర్ కూతురుగా, 'అల్లుడా మజాకా' సినిమాలో ఊహ చేసిన పాత్రను నేను చేయవలసింది. ఆ ఛాన్స్ మిస్సవ్వడం కూడా చాలా బాధను కలిగించింది. అలా అవకాశాలు వచ్చి పోవడానికి కారణం ఏమిటనేది కూడా నాకు తెలిసేది కాదు. 
 
అలాగే, తాను నటించిన సినిమాలకి సంబంధించి నాకు పారితోషికం ఇచ్చినవారికంటే ఎగ్గొట్టిన నిర్మాతలే అధికంగా ఉన్నారని చెప్పారు. కాగా, ఈమె ఈ తరం వాళ్లకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకపోయి ఉండొచ్చు. కానీ 90ల్లో ఉన్న జనరేషన్‌కు మాత్రం లతాశ్రీ పేరు బాగానే తెలుసు. అప్పట్లో చాలా సినిమాలు చేసింది ఈ సీనియర్ హీరోయిన్. 
 
గ్లామరస్ కారెక్టర్స్‌కు పెట్టింది పేరు ఈమె. ఒకప్పుడు వరస సినిమాలు చేసి తెలుగులో సంచలనాలు రేపింది కూడా. ముఖ్యంగా సీనియర్ హీరో నరేష్, సీత జంటగా రేలంగి నరసింహారావు తెరకెక్కించిన 'పోలీస్ భార్య' సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో చాలా బోల్డ్ పాత్ర చేసింది లతాశ్రీ. ఈ సినిమాలో కారెక్టర్‌కు అప్పట్లో ఆమెకు చాలా పాపులారిటీ కూడా వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రశాంత్ వర్మ హనుమాన్ పిల్లలు మెచ్చే సినిమా ఫుల్ రివ్యూ