Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటిగా గుర్తింపు తెచ్చుకున్నా... ప్చ్... వైవాహిక జీవితం ముగిసిపోయింది.. : సమంత

Advertiesment
samanta
, గురువారం, 9 నవంబరు 2023 (17:29 IST)
ఒక నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నానని, అదేసమయంలో తన వైవాహికబంధం ముగిసిపోయిందని ప్రముఖ హీరోయిన్ సమంత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటున్నారు. ఈ చికిత్సలో భాగంగా, భూటాన్‌లో హాట్ స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ చికిత్స తీసుకుంటున్నారు. రోగ నిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడేందుకు వీలుగా ఈ చికిత్స తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, తాజాగా హార్పర్స్ బజార్ అనే మేగజీన్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె అనేక వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. తాను ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నట్టు చెప్పారు. అదేసమయంలో తన వైవాహిక జీవితం ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం దెబ్బతినడం వల్ల తన పనిమీద ప్రభావం చూపిందన్నారు. దీని కారణంగా తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయని చెప్పారు. ఇవన్నీ తన జీవితంలో బాధాకరమైన విషయాలుగా ఆమె చెప్పుకొచ్చారు. పలు సమస్యలు తనను ఒక్కసారిగా చుట్టుముట్టాయని తెలిపారు. 
 
ఒకవైపు అనారోగ్యం, మరోవైపు మానసిక సంఘర్షణకు గురవుతున్న సమయంలో ఆరోగ్య సమస్యలకు గురైన వారి గురించి, ట్రోలింగ్ గురించి, ఆందోళనకు గురైన వారి గురించి కథనాలను చదివానని చెప్పారు. వాళ్లు ఇబ్బందుల నుంచి బయటపడిన కథనాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని వెల్లడించారు. తన శక్తిమేరకు తాను పోరాడుతున్నానని, ప్రతి ఒక్కరికీ ఇలాంటి సమయంలో పోరాడే శక్తి ఉంటుందని తాను భావిస్తున్నట్టు సమంత చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హన్సిక మథర్ స్కిన్ డాక్టర్ కావడంతో ఈ స్టోరీ కి బాగా కనెక్ట్ అయ్యారు : దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్