Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హన్సిక మథర్ స్కిన్ డాక్టర్ కావడంతో ఈ స్టోరీ కి బాగా కనెక్ట్ అయ్యారు : దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్

Hansika, Director Omkar Srinivas
, గురువారం, 9 నవంబరు 2023 (17:20 IST)
Hansika, Director Omkar Srinivas
హన్సిక లీడ్ రోల్‌లో ఓంకార్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫిమేల్ ఓరియెంటెండ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’.  వైష్ణవి ఆర్ట్స్ ప‌తాకంపై  బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్ ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలు..
 
- “పలు చిత్రాలకు రైటర్‌‌గా వర్క్ చేసిన నేను.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను.  కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక సోషల్ ఇష్యూ ని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నమే ‘మై నేమ్ ఇస్ శృతి’ చిత్రం ఉద్దేశం. 
 
కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా ఇది. ప్రతి ఒక్కరి జీవితం ఆడవాళ్ళతో ముడిపడి ఉంటుంది. అలాంటి ఆడవారికి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఓ అమ్మాయి విషయంలో రియల్ గా చూసిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని కథను రాశాను. 
 
మెడికల్ మాఫియా, కిడ్నీ మాఫియా లాంటివి చూసుంటాం కానీ ఇందులో స్కిన్ కు సంబంధించిన అంశాన్ని తీసుకున్నాం. దీని కోసం నాలుగు సంవత్సరాలు చాలా రీసెర్చ్ చేశా. బ్లడ్ బ్యాంకు లు ఎలా ఉన్నాయో స్కిన్ కి సంబంధించిన బెంగుళూరు కూడా దేశంలో ఉన్నాయి. అందులో నేపాల్ లో చాలా పెద్దది. స్కిన్ మాఫియా ట్రాప్ లో పడకుండా తనను తాను కాపాడుకునే పాత్రలో హన్సిక కనిపిస్తారు. 
 
హన్సిక వాళ్ళ అమ్మ రియల్ గా స్కిన్ డాక్టర్ కావడంతో హన్సిక ఈ స్టోరీ కి బాగా కనెక్ట్ అయ్యారు. హన్సిక స్కిన్ టోన్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది. విలేజ్ నుంచి తన డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి సిటీకి వచ్చే అమ్మాయిగా ఆమె కనిపిస్తుంది. హ్యాపీగా గడుస్తున్న జీవితంలోకి అనుకొని సంఘటన జరుగుతుంది ఆ ఘటనకు హన్సిక ఎలా రియాక్ట్ అయ్యారు అనేది సినిమాలో చూడాల్సిందే. ఆడవాళ్లు మగవారి కంటే స్ట్రాంగ్ గా ఉంటారనేది ఈ సినిమా సారాంశం. 
 
పెప్పర్ స్ప్రే లు లేకపోయినా తలలో ఉండే సేఫ్టీ పిన్ తో కూడా హ్యాండిల్ చేయగలరని ఇందులో చూపించాం. సినిమా చివరి వరకు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. స్కిన్ డోనర్స్  కూడా ఉంటారని మనం ఎక్కడ విని ఉండం.  కానీ ఇందులో చూపించాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్  కానీ సీక్వెల్ ఏమీ  ప్లాన్ చేయలేదు. రిజల్ట్ ను బట్టి చూస్తాం. అలాగే స్క్రిప్ట్ తో పాటు నన్ను అర్థం చేసుకున్న  టెక్నీషియన్స్ దొరకడం నా అదృష్టం. ప్రేక్షకులు ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మార్క్ కె  రాబిన్ మ్యూజిక్ హైలైగా ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు చేసిన సపోర్టును మర్చిపోలేను. కాన్సెప్ట్ నచ్చి హీరో రామ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఒక్క కట్ చెప్పకుండా సెన్సార్ సభ్యులు కూడా అభినందండం ఆనందంగా అనిపించింది’’. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నప్ప లో ఎంటర్ అయిన డా. మోహన్ బాబు, శరత్ కుమార్