Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా మనసుకు ఎంతో దగ్గరైన కథ ఇది : హన్సిక

Advertiesment
Hansika, Srinivas Omkar,  Prabhakar
, శనివారం, 4 నవంబరు 2023 (17:37 IST)
Hansika, Srinivas Omkar, Prabhakar
దేశ‌ముదురు సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసిన హ‌న్సిక అన‌తికాలంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నాయికగా నటించిన ఆమె క‌థానాయికగా న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం *మై నేమ్ ఈజ్ శృతి*   శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై  బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.."కథలో కొత్తదనం ఉన్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.
భాగమతి, పిల్ల జమిందార్ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన అశోక్ మరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.."వర్క్ పట్ల హన్సిక చాలా డెడికేటెడ్ గా ఉంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం హన్సికతో పాటు దర్శనిర్మాతలకు  మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నా" అని అన్నారు. 
 
హన్సిక మాట్లాడుతూ.."ఇదొక గ్రేట్ సబ్జెక్ట్ థ్రిల్లర్. నా మనసుకు ఎంతో దగ్గరైనా కథ. డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. వైష్ణవి ఆర్ట్స్ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని చెప్పారు.
 
దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ.."ఎంతో డెడికేషన్ తో కథ విని..
కొత్త దర్శకుడినైనా నన్ను ఎంకరేజ్ చేసిన  హన్సిక గారికి ధన్యవాదాలు. ఆమె కథను బలంగా నమ్మారు.అలాగే స్క్రిప్ట్ తో పాటు నన్ను అర్థం చేసుకున్న  టెక్నీషియన్స్ దొరకడం నా అదృష్టం. ఇందులోని సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాబిన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రొడ్యూసర్ గారు చేసిన సపోర్టును మర్చిపోలేను" అని చెప్పారు. 
 
నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ.."సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన హన్సిక గారికి ధన్యవాదాలు" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహులే ఆ పని చేశాడు.. అందుకే అక్క వదులుకుంది.. రతికా సోదరి