Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తకోట ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి...

Advertiesment
kothakota
, సోమవారం, 30 అక్టోబరు 2023 (15:37 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం అనూహ్య ఘటన ఒకటి జరిగింది. భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మెదక్ లోక్‌సభ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తకోట ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ దాడి ఘటన జరిగింది. రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దాడి జరగగానే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.
 
ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. మరోవైపు, దాడి అనంతరం ఎంపీ కొత్తను ఆయన వాహనంలోనే గజ్వేల్‌కు తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌‍ నగరంలోని యశోద ఆసుపత్రికి తరలించారు. 
 
నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు సమాచారం రావడంతో హుటాహుటిన బయలుదేరారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా రాజు కరచాలనం చేసేందుకు వచ్చి కత్తితో దాడి చేశాడు. నిందితుడిని మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌లో విలేకరిగా పని చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : సిసోడియాకు దక్కని ఊరట... బెయిల్‌కు సుప్రీం నో