ఈసారి అలా చేస్తే ఊరుకోనంటూ డైరెక్టర్‌కి నయనతార వార్నింగ్

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (17:31 IST)
నయనతార.. ఆమె అభిమానులు ముద్దుగా నయన్ అని పిలుస్తారు. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు స్లిమ్‌గా తయారై అభిమానుల మనస్సుల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంటోంది. నయనతార అభిమానులు ఆమె నటించిన కొత్త సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
 
అయితే ఈమధ్య నయనతార కాస్త డిప్రెషన్లో ఉందట. ఏకంగా డైరెక్టర్లకే వార్నింగులు కూడా ఇచ్చేస్తోందట. మామూలుగా డైరెక్టర్లు నటీనటులకు వార్నింగ్ ఇస్తుంటారు. కానీ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయన రూటే వేరు కదా.. అందుకే డైరెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చింది. 
 
తాజాగా నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు మురుగదాస్ దర్సకత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన దర్సకత్వంలో నయనతార గజినీ సినిమా చేసింది. ఆ సినిమాలో తన పాత్రను బాగా తగ్గించారని.. చెప్పిందొకటి తీసింది మరొకటి అంటూ అప్పట్లో మురుగదాస్‌తో గొడవపడింది ఈ భామ.
 
ఈ సినిమాలో తన పాత్ర తగ్గిస్తే ఊరుకునేది లేదని.. అవసరమైతే సినిమాను అడ్డుకుంటానని మురుగుదాస్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట నయనతార. ప్రస్తుతం నయనతార కోలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె చెప్పింది వినాలే తప్ప మరొక ఆప్షన్ లేదట. కాబట్టి మురుగదాస్ కూడా మౌనంగా ఉండిపోయారని సినీ యూనిట్ చెవులు కొరికేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments