Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీమామ.. అంటూ కెప్టెన్ కార్తీక్ వ‌స్తున్నాడు

Venky Mama movie
Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (17:25 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌తో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. అటు అక్కినేని అభిమానులు - ఇటు ద‌గ్గుబాటి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.
 
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలని రిలీజ్ చేసారు. ఈ రెండు పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... నెక్స్ట్ నాగచైతన్య పాత్రకు సంబంధించిన టీజర్‌ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇందులో నాగచైతన్య ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ పారా కమాండర్‌గా కనిపించబోతున్నాడు. అత‌ని పాత్ర పేరు కార్తీక్.
 
ఈ నెల 23న చైతు పుట్టినరోజు. ఈ సందర్బంగా 23న‌ కెప్టెన్ కార్తీక్‌కు సంబంధించి స‌ర్ఫ్రైజ్ ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా అఫిషియ‌ల్‌గా ఆ రోజు ఎనౌన్స్ చేస్తార‌ని టాక్ వినిపిస్తుంది. మ‌రి.. నాగ చైత‌న్య కెప్టెన్ కార్తీక్‌గా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments