Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ మీద గౌరవం ఉంది.. పద్దతిగా మాట్లాడండి.. అంబటికి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

మీ మీద గౌరవం ఉంది.. పద్దతిగా మాట్లాడండి.. అంబటికి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (18:13 IST)
తెలుగుదేశం ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా రాజ్యమేలింది.. వైసీపీ ప్రభుత్వం రాగానే కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామని చెప్పి.. టీడీపీ హయాంలో మాదిరే ఇసుక మాఫియాను తీసుకొచ్చారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల మూలంగా లక్షల మంది కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, వాహన యజమానులు రోడ్డునపడ్డారు అని తెలిపారు. అచ్చంగా ఇసుక రవాణాపైనే ఆధారపడి ఉన్న 6 వేల లారీలకే పనుల్లేకుంటే కొత్తగా మరో 6 వేల లారీలను రంగంలోకి దించడం విడ్డూరమన్నారు. 
 
లారీలకు రుణాలిప్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమే.. అయితే ఉన్న లారీల సంగతి ఏంటి..? ఎవరి లబ్ది కోసం ఈ ప్రయత్నమని ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “చట్టాలను సంరక్షించాల్సిన ముఖ్యమంత్రే వాటిని బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి రాయితీతో కూడిన 6 వేల లారీలు అందిస్తామని ప్రభుత్వం జీవో నంబర్ 486 జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలతో పురుడు పోసుకున్న జి.ఎస్.టి. విధివిధానాలను కాదని జీవో నంబరు 486లో జి.ఎస్.టి. మొత్తాన్ని తగ్గించే విషయం ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొనడం శోచనీయం. కావాలంటే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయాలి. 
 
రేపు మిగతా రాష్ట్రాలు కూడా ఇదే పద్దతిని అనుసరిస్తే కేంద్రం ఇచ్చే నిధులకు కోతపడుతుంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, జి.ఎస్.టి. కౌన్సిల్, అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తా. 
 
పది మందికీ పని ఇచ్చే మేస్త్రీలకు పస్తులు... 
 
వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. 10 మందికి ఉద్యోగం కల్పించడం కోసం 10 వేల మందిని తీసేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించాలి కానీ ఉన్న ఉద్యోగాలు తీసేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చే పద్ధతి మంచిది కాదు.
webdunia

 
వైసీపీ పాలనలో ప్రజలకు చవకగా ఇసుక దొరుకుతుంది, నిర్మాణ రంగం మరింత బలోపేతం అవుతుంది, రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంటుందని భావించాను. 15 రోజుల్లో ప్రకటిస్తామన్న ఇసుక పాలసీ 45 రోజులైనా.. మూడు నెలలైనా.. 100 రోజులు దాటేసినా అతీగతీలేదు. ఈ రోజుకీ ఇసుక విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడంతో భవన నిర్మాణరంగం సంక్షోభంలో పడిపోయింది. 
 
ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 35 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కుటుంబానికి పిడికెడు ముద్ద పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. 10 మందికి పని కల్పించే మేస్ర్తీలు కూడా పస్తులు పడుకోవాల్సిన దుస్థితి దాపురించింది. తెలుగుదేశం ప్రభుత్వ ఇసుక మాఫియాకు ఏమాత్రం తీసిపోని విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

మన ఇసుక మనకు దొరకడం లేదు కానీ బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో దర్శనమిస్తోంది. ఇక్కడ ఇన్ని నదులుండి కూడా ఇసుకను తెలంగాణ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆన్ లైన్ సిస్టమ్ లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. దొంగల్లా అర్థరాత్రి 12 గంటలకు తెరుస్తున్నారు. 
 
అవాకులు చవాకులు కాదు... ఆన్సర్ చెప్పండి ...
 
రాజధాని ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ వెటకారంగా మాట్లాడతారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు కోట్లాది మంది ప్రజలు ప్రభావితులు అవుతారని మరిచిపోతున్నారు. తెలుగుదేశం పార్టీపై కోపాలు తాపాలు ఉంటే వేరేలా చూపించుకోండి. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ రాయలసీమకు చెందిన లాయర్లు వచ్చి కలిశారు. ఇప్పటివరకు సీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అయినా సీమ సమస్యలు తీరలేదు. 
 
ప్రస్తుత హైకోర్టు పరిసరాల్లో టీ కూడా దొరికే పరిస్థితి కూడా లేదు. వైసీపీ ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజధాని కడతారా లేదా..? రాయలసీమకు హైకోర్టును తరలిస్తారా..? లేదా అన్నది స్పష్టంగా చెప్పండి. అంబటి రాంబాబు కామెంట్లు కూడా నా దృష్టికి వచ్చాయి. మీ మీద గౌరవం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి. ఎన్నికలు ఐదేళ్లు ఉన్నాయి అనుకుంటున్నారేమో ముందే వస్తాయి. అవన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. భవన నిర్మాణ కార్మికులను సంక్షోభం నుంచి రక్షించడానికి ఏం చేస్తారో చెప్పండి. మీ ప్రభుత్వ విధానాల వల్ల మరో సంవత్సరం పాటు రోడ్డు మీదే ఉండే పరిస్థితి కనిపిస్తోంది.
webdunia
 
ప్రజలు దెబ్బకొట్టే రోజు దగ్గరలోనే ఉంది...
 
క్రమక్రమంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోతోంది. ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలే తిరిగి దెబ్బకొట్టే రోజు దగ్గరలోనే ఉంది. దయచేసి ప్రభుత్వం ఆలోచించి సమస్యకు పరిష్కార మార్గాలు వెతకాలి. ఏ ప్రభుత్వమైనా సవ్యంగా పరిపాలిస్తే మిగతా పార్టీలకు పని ఉండదు. 100 రోజుల్లోనే ఇన్ని అవకతవకలకు పాల్పడితే రోడ్ల మీదకు వచ్చి తీరుతామని హెచ్చరించారు. ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు కనుకే నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేస్తున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదనంగా ఏడాది పాటు అప్రెంటిస్‌ : సీఎం జగన్ ఆదేశాలు