Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీలో వల్లభనేని వంశీ కలకలం.. సుజనా కారెక్కి వెళ్ళిపోయారు

Advertiesment
టీడీపీలో వల్లభనేని వంశీ కలకలం.. సుజనా కారెక్కి వెళ్ళిపోయారు
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:27 IST)
తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ కలకలం సృష్టించారు. ఆయన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కారులో ఎక్కి వెళ్లడమే ఇందుకు కారణంగా ఉంది. 
 
శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న వంశీ.. తొలుత సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల మంత్రి కొడాలి నానితో రహస్య మంతనాలు జరిపారు. 
 
ఈ నేపథ్యంలో వంశీ వైసీపీలోకి వస్తారా? లేక బీజేపీలోకి వెళ్తారా? లేక తెలుగుదేశం పార్టీలో చేరుతారా? అనే అంశంపై టీడీపీ కార్యకర్తల్లో విస్తృత చర్చ సాగుతోంది. దీనిపై మరికొన్ని గంటల్లో ఓ క్లారిటీ రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ మృతి