Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నాలుగో సీజన్.. నాగ్ షూటింగ్‌కు వెళ్తారా? హోస్ట్ చేస్తారా?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:06 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆసక్తికరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా వున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. సమ్మర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ.. కరోనా కారణంగా ఆగింది. అయితే ఈ సినిమా కోసం కొంత షూటింగ్ థాయ్‌లాండ్‌లో చేయాల్సివుంది. అప్పుడు కరోనా కారణంగా ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు.
 
ఇప్పుడు కరోనా తగ్గడంతో థాయ్‌లాండ్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. నాగార్జున థాయ్ లాండ్ వెళ్లి వైల్డ్ డాగ్ షూటింగ్‌లో పాల్గొంటే.. మరి.. బిగ్ బాస్ హోస్ట్‌గా ఎవరు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. 
 
బిగ్ బాస్ 3 సీజన్‌లో తన బర్త్ డే సందర్బంగా విదేశాలకు వెళ్లిన నాగార్జున ఆ సమయంలో రమ్యకృష్ణను హోస్ట్‌గా పంపించాడు. రమ్యకృష్ణ వచ్చిన రెండు రోజులు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈసారి కూడా ఒక గెస్ట్ హోస్ట్ వస్తాడేమో అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
నాగార్జున థాయ్‌లాండ్ వెళితే ఒక శనివారం ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది. అంటే ఆ సమయంలో ఎవరు హోస్ట్ చేస్తారు అనేది చూడాలి. ఒకవేళ థాయిలాండ్ నుండి షో కోసం ప్రత్యేకంగా నాగార్జున వచ్చి వెళ్తారా..? లేక వేరే ఎవరితో అయినా చేయిస్తారా..? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments