Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాదిగా గౌతమ్ కిచ్లూతో కలువ కళ్ళ సుందరి డేటింగ్!?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:33 IST)
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె త్వరలోనే పెళ్లీపీటలెక్కనుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్క్రోలింగ్ చేస్తున్నారు. కానీ, కాజల్ మాత్రం ఎక్కడా కూడా రవ్వంత కూడా సమాచారం బయటకు రానివ్వడం లేదు. అయితే, తాజాగా ఓ యువ పారిశ్రామికవేత్తను పెళ్లాడనున్నట్టు ఓ వార్త లీక్ అయింది. తాను పెళ్లి చేసుకోబోయే వరుడు పేరు గౌతమ్ కిచ్లూ. ముంబైలో డిస్ సెర్న్ లివింగ్ అనే ఇంటీరియల్ డిజైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నట్టు సమాచారం. పైగా, ఈయన కాజల్‌తో గత యేడాదిగా డేటింగ్‌లో ఉన్నట్టు ముంబై మీడియా కోడై కూస్తోంది. 
 
నిజానికి ఈ కలువ కళ్ళ సుందరి పెళ్లి వార్త ఇప్ప‌టికే నెట్టింట్లో వైర‌ల్ అయిన విషయం తెల్సిందే. కాజ‌ల్‌ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంద‌ని, ఈ బ్యూటీ సీక్రెట్ గా ‌ఓ వ్యాపార‌వేత్త‌తో ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకుంద‌ని న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన వార్త‌లపై కాజల్ ఎక్కడా కూడా స్పందించలేదు. 
 
ఈ క్రమంలో ముంబై మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం కాజ‌ల్ బిజినెస్‌మెన్ గౌత‌మ్ కిచ్లూలుతో ఎంగేజ్ మెంట్ అయిన‌ట్టు క‌థ‌నాల సారాంశం. డిస్ సెర్న్ లివింగ్ అనే ఇంటీరియ‌ర్ కంపెనీని నిర్వ‌హిస్తున్నాడు. అంతేకాదు గౌత‌మ్‌, కాజ‌ల్ చాలా కాలంగా డేటింగ్‌లో కూడా ఉన్నార‌ట‌.
 
కాజ‌ల్ త్వ‌ర‌లోనే వెడ్డింగ్ ప్లాన్ ప్ర‌క‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 2021 ఫ‌స్ట్ హాఫ్‌లో కాజ‌ల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స‌వ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. చిరంజీవితో న‌టిస్తోన్న "ఆచార్య"‌, క‌మ‌ల్ హాస‌న్‌తో చేస్తోన్న "ఇండియ‌న్-2" చిత్రాల‌ను ఈ లోపే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు టాలీవుడ్ లోగుట్టు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments