Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతన్య సరికొత్త ప్రయత్నం వర్కవుట్ అవుతుందా..?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (16:57 IST)
అక్కినేని నాగచైతన్య - సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం లవ్ స్టోరీ. ఇందులో చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ ఇంకా ఓ పాట, కొంత టాకీ షూట్ చేయాల్సివుంది. అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చైతన్య చేయనున్న మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
 
ఈ వార్త అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుందని చెప్పచ్చు. ఇంతకీ.. ఆ న్యూస్ ఏంటంటే లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య మనం ఫేమ్ విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున్నారు.
 
 ఈ సినిమాకి బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నారు. థ్యాంక్యూ టైటిల్‌తో రూపొందే ఈ విభిన్న కథా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే… ఈ సినిమాలో చైతన్య మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారట.
 
ఈ మూడు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని.. మనం తరహాలో చాలా కొత్త కథ అని టాక్. ఫైనల్ నెరేషన్ విని చైతు ఓకే చెప్పారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే అఫిషియల్‌గా ఈ మూవీని ఎనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చైతన్య మూడు గెటప్పులో కనిపించడం అంటే కొత్తగానే ఉంటుంది. మరి... ఈ సరికొత్త ప్రయత్నం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments