మెగాస్టార్ చిరంజీవి నిర్ణయంతో షాకైన కొరటాల శివ

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (16:52 IST)
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొరటాలతో చిరంజీవి సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి  అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
 
కరోనా అనేది రాకపోతే ఆచార్య మూవీని ఈ నెలలో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇదిలా ఉంటే… ఆగష్టు 22 చిరంజీవి పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా ఆచార్య మూవీకి సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్టు అపిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
అయితే… డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారట. అంతేకాకుండా టీజర్‌ను రెడీ కూడా చేసారట. అది చిరంజీవికి చూపించారట. అయితే... చిరు నో చెప్పి కొరటాలకు షాక్ ఇచ్చారని తెలిసింది. చిరు కొరటాలకు షాక్ ఇవ్వడమా..? అనుకుంటున్నారా..?
 
ఇంతకీ విషయం ఏంటంటే… ఆచార్య మోషన్ పోస్టర్, టీజర్.. ఇలా అన్నీ ఇప్పుడే రిలీజ్ చేసేస్తే… ముందుముందు రిలీజ్ చేయడానికి ఏమీ ఉండదు అనేది చిరంజీవి ఆలోచన. వినాయక చవితి, దసరా, దీపావళి… ఇలా పండగలు ఉన్నాయి కదా. అప్పుడు రిలీజ్ చేద్దాం. ఇప్పుడు వద్దు అని మెగాస్టార్ సున్నితంగా నో చెప్పారట. అది మేటరు..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments