Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ణిశ‌ర్మ వివాదం!

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (17:12 IST)
Manisarma
సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ అంటే సినిమా వాళ్ళ‌కు గౌర‌వం వుంది. ఆయ‌న ఎప్పుడూ పెద్ద‌గామాట్లాడ‌రు. సినిమా వేడుక‌ల‌కు రాడు. ఆయ‌న వ‌స్తే అది పెద్ద సినిమా అయితేనే. ఇక అలాంటి మ‌ణిశ‌ర్మ‌కు ఇటీవ‌లే ఓ జ‌ర్క్ త‌గిలింది. ఇప్ప‌టి ట్రెండ్ ప్ర‌కారం కొత్త కొత్త సంగీత ద‌ర్శ‌కులు వ‌స్తున్నా వారిని ఎంక‌రేజ్ చేస్తూ వుండే మ‌ణిశ‌ర్మ త‌న కుమారుడు మ‌హ‌తీని కూడా సంగీత ద‌ర్శ‌కుడిగా చేశాడు. మ‌హ‌తి ప‌లు సినిమాల‌కు ప‌నిచేస్తున్నాడు. ఇదిలా వుండ‌గా, వెంక‌టేష్ సినిమా నార‌ప్ప‌కు మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడు. ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు సంగీతానికి సంబంధించిన ప‌లు ప‌నులు మ‌ణిశ‌ర్మ చేస్తున్నాడు. అయితే ఇక్క‌డ చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌కు, మ‌ణిశ‌ర్మ‌కు మ‌ధ్య కొన్ని విష‌యాల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డింది. సంగీతం విష‌యంలో చిత్ర ద‌ర్శ‌కుడు ఫ్రీడం ఇవ్వాల‌ని అన్నాడు. ఆ విష‌యాన్ని ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో మ‌ణిశ‌ర్మ చెప్పాడు. నార‌ప్ప సినిమాకు సంగీతం అందించే విష‌యంలో త‌న‌కు స్వేచ్ఛ ఇవ్వ‌డం లేదంటూ ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. దీంతో మంచి టాపిక్ దొరికింద‌ని సోష‌ల్‌మీడియాలో తెగ ర‌చ్చ‌ర‌చ్చ చేస్తున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఇలాంటివి బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ మ‌ణిశ‌ర్మ‌కు సూచించింది. అయితే ఇది తాను కావాల‌ని నెగెటివ్‌గా చెప్ప‌లేద‌ని, ఇది అనుకోకుండా జరిగిన సంఘ‌ట‌నే అని, కాజువ‌ల్‌గా సంగీత ద‌ర్శ‌కుడికి స్వేచ్ఛ ఇవ్వాల‌నీ అప్పుడు మంచి ఔట్‌పుట్ వ‌స్తుంద‌ని మాత్ర‌మే చెప్పాన‌నీ, క్లారిటీ ఇచ్చిన‌ట్లు తెలిసింది. అస‌లే చాలా కాలం త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల చేస్తున్న సినిమా కాబ‌ట్టి త‌నే స‌ర్దుకుంటే పోయేదిక‌దా అని మాట‌లు ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తున్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌రుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

కర్నూలులో దారుణం: చిన్నారి శరీరానికి రంగు పూసి భిక్షాటనకు రోడ్డుపై కూర్చోబెట్టారు

పవన్ కల్యాణ్ గారికి దణ్ణం, తుమ్మలచెరువు గ్రామంలో శరవేగంగా సీసీ రోడ్డు పనులు video

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. మళ్లీ సీన్‌లోకి "డయల్ యువర్ సీఎం"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments