Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి హీరోగా తెలుగులోకి వేదాళం రీమేక్... కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో...

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (19:17 IST)
మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి తన పాత వృత్తిలోకి వచ్చిన మెగాస్టార్... వరుస  చిత్రాల్లో నటించేందుకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న "ఆచార్య" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. అయినప్పటికీ.. ఆయన తన కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతున్నారు.
 
ఈ కోవలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుంటే, తన కుమారుడు రాంచరణ్ తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే, తమిళ హీరో అజిత్ నటించిన 'వేదాళం' చిత్రాన్ని కూడా చిరంజీవి రీమేక్ చేయనున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. 
 
ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో చిరంజీవి చెల్లిగా కుర్ర హీరోయిన్ సాయిపల్లవి నటించనుంది. అలాగే, మణిశర్మ సోదరుడు సాగర్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చనున్నారు. 'ఆచార్య' చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత 'లూసిఫర్‌'తో పాటు.. 'వేదాళం' చిత్రాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మెగాస్టార్ నిర్ణయించి, ఆ ప్రకారంగా తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకుంటున్నారు. 
 
అయితే, ఈ 'వేదాళం' చిత్రాన్ని కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్ర కథకు కోల్‌కతా నగరానికి మధ్య ఏదో లింకు ఉంది. అందుకే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి నటించిన "చూడాలని వుంది" చిత్రం ఇదే బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments