Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కోసం ఢిల్లీ సుందరిని ఫైనల్ చేసిన త్రివిక్రమ్!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (15:22 IST)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న రెండో చిత్రం ఇది. గతంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో రెండో చిత్రంలో కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డేను రిపీట్ చేయాలని తొలుత భావించారు. ఆ తర్వాత మలయాళ బ్యూటీ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు ఢిల్లీ సుందరి కేతిక శర్మను ఫైనల్ చేసినట్టు సమాచారం. 
 
ఒక‌వేళ త్రివిక్ర‌మ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫైన‌ల్ చేస్తే.. కేతిక‌ గ్లామ‌ర‌స్ రోల్ ఎన్టీఆర్‌ మూవీకి మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆకాశ్ పూరీతో కేతిక శ‌ర్మ క‌లిసి "రొమాంటిక్" చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. 
 
ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌లో హాట్, స్పైసీ లుక్‌లో అద‌ర‌గొట్టింది. మ‌రి త్రివిక్ర‌మ్ కాంపౌండ్ నుంచి హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యమైన క్లారిటీ రావాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments