Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపదలో ఉన్న అభిమానికి ఫోన్ చేసి మాట ఇచ్చిన ఎన్టీఆర్

Advertiesment
NTR Fan
, బుధవారం, 4 నవంబరు 2020 (13:28 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అభిమానులు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటారు. తన సినిమా ఫంక్షన్‌కి వచ్చిన అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్లాలని పదేపదే చెబుతుంటారు. తన కుటుంబంలో జరిగినట్టుగా వేరే ఎవరి కుటుంబంలో ప్రమాదం జరగకూడదని చెబుతుంటారు. ఎల్లప్పుడూ అభిమానుల క్షేమాన్ని కాంక్షించే ఎన్టీఆర్ తాజాగా తన వీరాభిమాని వెంకన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ తనను కలవడానికి ఎదురుచూస్తున్నాడని తెలుసుకున్నారు ఎన్టీఆర్ ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.
 
ఎన్టీఆర్‌తో వెంకన్న మాట్లాడుతూ.... నాకు మీతో సెల్ఫీ దిగాలని ఉందన్నా అని అడగ్గానే తారక్ ఈ కరోనా గొడవ తగ్గాక ఖచ్చితంగా కలుద్దామని అన్నారు. ఇంతలో అభిమాని మిమ్మల్ని కలవడానికైనా బ్రతుకుతాను అనగానే నీకు ఏం కాదు.. నాకు ఏం కాదు... తప్పకుండా కలుస్తాను, మంచి ఫోటో దిగుదాం. నువ్వు మాత్రం బాగా తిని సంతోషంగా ఉండు. వెంకన్న తల్లికి, తనకు వీలైన సహాయం తప్పకుండా చేస్తానని మాటిచ్చారు.
 
తారక్ నేరుగా ఫోన్ చేసి మరీ మాట్లాడటంతో వెంకన్న ఆనందానికి అవధులు లేవు. తారక్ చేసిన ఈ మంచి పని గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యం ఎలావుంది?