Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానాకి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్‌... ఇంత‌కీ ఏం చేసింది..?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (20:35 IST)
ద‌గ్గుబాటి రానా... బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యాడు. దీంతో రానాతో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇటీవ‌ల విదేశాల నుంచి ఇండియాకి వ‌చ్చిన రానా ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న సినిమాలపై దృష్టి పెట్టాడు. రానా హీరోగా ఒక సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. 
 
మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ, ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అట. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను తీసుకున్నది రానానే. ఆయన జోడీగా న‌టించేందుకు కీర్తి సురేష్‌‌ను సంప్రదించార‌ట‌. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్‌కి విపరీతమైన క్రేజ్ వుంది. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు వరుస విజయాలను సాధిస్తూ రావడంతో ఆమె క్రేజ్ పెరుగుతూ వెళ్లింది. 
 
మహానటి చిత్రానికి ముందు గ్లామర్ పరంగానే యూత్‌ను ఆకట్టుకున్న ఆమె, ఆ తరువాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. అందుక‌నే రానా స‌ర‌స‌న న‌టించ‌మ‌ని అడిగితే ఆమె నో చెప్పి షాక్ ఇచ్చింద‌ట‌. దీనికి కారణం.. ఆమెకు కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు అయ్యుండకపోవడమా? అన్నది తెలియరాలేదు. దీంతో ఇప్పుడు నందినీ రెడ్డి మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తుంద‌ట‌. మ‌రి... రానా స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ఎవ‌రికీ వ‌స్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments