భార్యకు విడాకులు ఇస్తానన్నాడు.. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు: కంగనా రనౌత్

బాలీవుడ్ హృతిక్ రోషన్ తనను ప్రేమించి మోసం చేశాడని స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హృతిక్ రోషన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మాట నిజమేనని.. కానీ అతనికి అప్పటికే పెళ్లైపోవడంత

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (18:12 IST)
బాలీవుడ్ హృతిక్ రోషన్ తనను ప్రేమించి మోసం చేశాడని స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హృతిక్ రోషన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మాట నిజమేనని.. కానీ అతనికి అప్పటికే పెళ్లైపోవడంతో తనను పక్కనబెట్టేశాడని కంగనా వెల్లడించింది. తమ ప్రేమ గురించి బయటలోకానికి తెలియకుండా వుండాలని హృతిక్ రోషన్ కోరాడని.. అది తనకు నచ్చకపోవడంతో ఆతనికి దూరమయ్యానని తెలిపింది. 
 
ఓ రోజు తనను పిలిచి తన భార్యకు విడాకులు ఇవ్వనున్నానని.. ఆపై తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినట్లు కంగనా చెప్పింది. కానీ వేరొక నటితో హృతిక్‌కు లింకున్నట్లు వార్తలు రావడంతో ''నన్ను మరిచిపోమన్నాడంటూ'' తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందుకే అతనితో తనకుండిన సంబంధాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశానంది. ఆపై తనకు బెదిరింపులు వచ్చాయని, హృతిక్‌తో వున్న ఫోటోలను నెట్లో పెట్టేస్తానంటూ వేధించారని కంగనా చెప్పుకొచ్చింది. దీనిపై మహిళా సంఘాలను సంప్రదించినా ఫలితం లేదని.. నటిగా తనకే న్యాయం జరగలేకపోతే.. సాధారణ మహిళ పరిస్థితి ఏంటని కంగనా ప్రశ్నించింది. 
 
మరోవైపు.. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ అధ్యాయ‌న్ సుమ‌న్ పెద్ద‌గా పట్టించుకున్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. కంగ‌నా అన్న మాట‌ల గురించి మీడియా అధ్యాయ‌న్‌ని ప్ర‌శ్నించ‌గా మ‌నుషుల‌న్నాక ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయ‌ని, ప్ర‌స్తుతం త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని అధ్యాయ‌న్ పేర్కొన్నాడు. గ‌తంలో కంగ‌నా త‌న‌ను కొట్టింద‌ని, వేధించింద‌ని అధ్యాయన్ చేసిన ఆరోప‌ణ‌లను ఇంట‌ర్వ్యూలో కంగ‌నా ర‌నౌత్ ఖండించింది. తాను నిజంగా కొట్టినా బావుండేద‌ని అంది. ఇదే ఇంటర్వ్యూలో రాకేశ్ రోష‌న్‌, హృతిక్ రోష‌న్‌, ఆదిత్య పంచోలీల గురించి కూడా కంగ‌నా వివాదాస్ప‌ద విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. వీటిపై హృతిక్ రోష‌న్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. అయితే ఆదిత్య పంచోలీ మాత్రం కంగ‌నా పిచ్చిద‌ని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంద‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments