Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్కార్ ఇచ్చినా వెళ్లను.. జాతీయ అవార్డులే బెస్ట్: కంగనా రనౌత్

బాలీవుడ్‌లో బోల్డ్ యాక్టర్‌గా పేరు కొట్టేసిన కంగనా రనౌత్.. తాజాగా ఆస్కార్ అవార్డుపై స్పందించింది. ఏ అవార్డుల ఫంక్షన్‌కూ హాజరు కాని ఈ ముద్దుగుమ్మ.. ఆస్కార్ అవార్డు లభిస్తే ఆ ఫంక్షన్‌కి కూడా హాజరు కారా?

ఆస్కార్ ఇచ్చినా వెళ్లను.. జాతీయ అవార్డులే బెస్ట్: కంగనా రనౌత్
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (17:11 IST)
బాలీవుడ్‌లో బోల్డ్ యాక్టర్‌గా పేరు కొట్టేసిన కంగనా రనౌత్.. తాజాగా ఆస్కార్ అవార్డుపై స్పందించింది. ఏ అవార్డుల ఫంక్షన్‌కూ హాజరు కాని ఈ ముద్దుగుమ్మ.. ఆస్కార్ అవార్డు లభిస్తే ఆ ఫంక్షన్‌కి కూడా హాజరు కారా?అన్న ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది. ఆస్కార్ అవార్డు తనకు వచ్చినా... దాన్ని తీసుకునేందుకు తాను అక్కడికి వెళ్లనని తేల్చి చెప్పేసింది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో జరిగే అవార్డు ఫంక్షన్లలో గ్రూపు కుట్రలుంటాయని ఆరోపించింది. అక్కడ టాలెంట్లు చూసి అవార్డులు ఇవ్వరు. వేడుకలను ఆర్గనైజ్ చేసే వారు సాకులు చెప్తారు. ఉచితంగా ప్రదర్శనలు ఇవ్వమంటారు. లేకుంటే ప్రదర్శనలు ఇచ్చిన వారికే అవార్డులు ఇస్తామంటారు. నైపుణ్యతకు అక్కడ చోటుండదు. కానీ జాతీయ అవార్డుల వేడుకలు మాత్రం నిజాయితీగా వుంటాయి. 
 
వారు టీఆర్పీ కోసం పట్టుబట్టరని కంగనా స్పష్టం చేసింది. ఇప్పటికే మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న కంగనా, ప్రభుత్వ అవార్డు ఫంక్షన్లకు మాత్రం హాజరైంది. ఆస్కార్ అవార్డు తీసుకోవడం కంటే.. మన రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవటమే ఉత్తమమని కంగా సమాధానమిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. 'అర్జున్ రెడ్డి'పై సమంత పొగడ్తలు... అతడితో నటిస్తుందా?