Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతనో ఓ శాడిస్ట్... చాలా డేంజర్... ఆదిత్యపై కంగనా తిట్ల దండకం

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఏకిపారేసింది. ‘ఆప్‌ కా అదాలత్‌’ కార్యక్రమంలో పాల్గొని సంచలన విషయాలు వెల్లడించింది. 2016లో రేగిన 'సిల్లీ ఎక్స్' వివాదం తర్వాత హృతిక్‌ రోషన్‌ తనక

Advertiesment
అతనో ఓ శాడిస్ట్... చాలా డేంజర్... ఆదిత్యపై కంగనా తిట్ల దండకం
, ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (16:21 IST)
బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఏకిపారేసింది. ‘ఆప్‌ కా అదాలత్‌’ కార్యక్రమంలో పాల్గొని సంచలన విషయాలు వెల్లడించింది. 2016లో రేగిన 'సిల్లీ ఎక్స్' వివాదం తర్వాత హృతిక్‌ రోషన్‌ తనకు ఎదురుపడలేదని, కానీ అతనితో ఒకసారి ముఖాముఖి మాట్లాడాలనుకుంటున్నానని తెలిపింది. ఈ వివాదంలో హృతిక్‌‌కు మద్దతు పలికిన ఆదిత్య పంచోలీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తెలిపింది. ఆదిత్య కుమార్తె కంటే తాను ఏడాది చిన్నదాన్నని తెలిపింది. తనకు 17 ఏళ్ల వయసప్పుడు సినీ పరిశ్రమకు వచ్చానని తెలిపింది.
 
సినిమాల విషయంలో తనను ఆదిత్య రక్తం వచ్చేలా కొట్టేవాడని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తనకు సాయం చేయమని అతని భార్య జరీనా వహబ్‌‌ను వేడుకున్నానని తెలిపింది. అయితే ఆదిత్య ఇంటికి రావడం లేదని, దాంతో తాను హాయిగా ఉన్నానని తెలిపిందని కంగనా వెల్లడించింది. దీంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే తాను హింసలు అనుభవిస్తున్నట్టు తెలిస్తే తన తల్లిదండ్రులు బాధపడతారని ఫిర్యాదు చేయలేదని చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనసూయకు 3 లక్షల మంది వార్నింగ్... ఎందుకు..!