మరింత నాజూగ్గా తయారైన అగ్రహీరోయిన్

Webdunia
శనివారం, 30 మే 2020 (22:34 IST)
లాక్ డౌన్ ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా 60రోజులను దాటింది. ఈ గ్యాప్‌లో షూటింగ్‌లు కాస్త ఆగిపోయాయి. ఇక హీరోహీరోయిన్లు అయితే ఫిట్‌నెస్‌గా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామాలు, డైటింగ్‌లు పాటించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది జాగ్రత్తగా మెయింటైన్స్ చేసుకుంటూ అభిమానులతో చాట్ చేసుకుంటూ లాక్ డౌన్‌ను పూర్తి చేసేస్తున్నారు.
 
ఈ గ్యాప్‌లో నటి కాజల్ కూడా మరింత నాజూగ్గా తయారైందట. పక్కా డైట్‌తో నిపుణుల సహకారంతో నాజూగ్గా తయారైన కాజల్ త్వరలో కెమెరా ముందుకు రాబోతోందట. కాజల్ కాస్త బొద్దుగా అయినట్లు ఉన్నావే అని కొంతమంది ఆటపట్టించారట. హీరోయిన్ అంటే ఇంకా సన్నగా ఉండాలి. జీరో సైజ్ నడుము పూర్తిగా ఉండాలి. 
 
కానీ నీకు పొట్ట కాస్త ముందుకు ఉందని స్నేహితులే ఎగతాళి చేశారట. దీంతో కాజల్ సన్నగా అవ్వాలని నిర్ణయించుకుందట. దీనికి తోడు ఆమెకు లాక్‌డౌన్ బాగా కలిసొచ్చిందట. ఇంట్లోనే డైట్ పాటిస్తూ సమయానికి వ్యాయామాలు చేస్తూ బాగా సన్నగా మారిపోయిందట. ఈ విషయాన్ని కాజల్ తండ్రి స్వయంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారట. 
 
కానీ కాజల్ ఫోటోలు మాత్రం ప్రస్తుతం బయటకు రావడం లేదు. నేరుగా షూటింగ్ లోనే తాను ఎంతగా సన్నగా అయ్యాను. ఏ విధంగా ఫిట్ నెస్ గా ఉన్నానని చూపిస్తానని కాజల్ చెప్పిందట. దీంతో కేవలం చిన్న సమాచారాన్ని మాత్రమే పంపారు తప్ప కాజల్ ఎలా స్లిమ్ గా మారిందో మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దీంతో అభిమానుల్లో ఆతృత కనిపిస్తోంది. కాజల్ ఫోటోలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

వందరూపాయలతో మ్యాగీ, కూల్‌డ్రింక్స్‌తో బర్త్ డే చేసుకున్న బాలుడు.. వీడియో వైరల్

హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 43 డిగ్రీల మార్కు

జగన్‌ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...

తర్వాతి కథనం
Show comments