పవన్ మెట్రో ట్రైన్ జర్నీ వెనుక స్టోరీ ఇదేనా..?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (10:23 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ "వకీల్ సాబ్". ఈ చిత్రాన్ని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా సమ్మర్‌కి రావాల్సిన 'వకీల్ సాబ్' ఇప్పటి వరకు రాలేదు. రీసెంట్ 'వకీల్ సాబ్' షూటింగులో జాయిన్ అయ్యారు. 
 
అయితే... పవన్ ఉన్నట్టుండి సడన్‌గా మెట్రో ట్రైనులో దర్శనమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌లో ఊపు వచ్చింది. సోషల్ మీడియాలో అయితే... ఒకటే హడావిడి. దీంతో మళ్లీ 'వకీల్ సాబ్' వార్తల్లోకి వచ్చాడు. దీని వెనకున్న స్టోరీ ఇదే అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.
 
అది ఏంటంటే... 'వకీల్ సాబ్' సినిమా ప్రారంభించినప్పుడు.. ఆ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. కరోనా కారణంగా ఎప్పుడైతే సినిమా హాల్స్ మూతపడ్డాయో.. అప్పటి నుంచి 'వకీల్ సాబ్' గురించే కాదు.. ఏ సినిమాపై పెద్ద అంచనాలు లేవు. 
 
ఇంకా చెప్పాలంటే.. సినిమాల గురించి ఆలోచించే మూడ్‌లో జనాలు అస్సలు లేరు.ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది. అయితే.. 'వకీల్ సాబ్‌'‌ను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.
 
అందుచేత ఈలోపు మళ్లీ 'వకీల్ సాబ్'పై క్రేజ్ తీసుకురావడానికి... దిల్ రాజు ప్లానే ఈ మెట్రో ట్రైన్‌లో పవర్ స్టార్ ప్రయాణం అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు ప్లాన్ బాగానే ఉంది. ముందుముందు ఇంకెన్ని ప్లాన్ వేస్తారో... ఎంత బజ్ క్రియేట్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments