మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారా..?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:46 IST)
సూపర్ స్టార్ మహేష్‌ బాబు - గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో మహేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది. బ్యాంక్‌నే మోసం చేసిన మోసగాడి ఆటను ఎలా కట్టించాడు..? వాడికి ఎలా బుద్ధి చెప్పాడు అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలిసింది.
 
ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇందులో మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారట.
 
 ఒకటి పాన్ బ్రోకర్ కాగా, రెండోది బ్యాంక్ ఆఫీసర్.. ఈ రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని.. ఫ్యాన్స్‌కి తెగ నచ్చేస్తాయని అంటున్నారు. అయితే... ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.
 
ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే రెండు పాత్రలు చేస్తున్నాడా..? లేక ఒకటే పాత్ర రెండు రకాలుగా కనిపిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అమెరికాలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. మహేష్‌ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు టీమ్. మహేష్ ద్విపాత్రాభినయం పై వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments