వెంకీ.. నారప్ప, ఎఫ్ 3 గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్..!

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:45 IST)
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమా చేస్తున్నారు. కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. తమిళంలో విజయం సాధించిన అసురన్ సినిమాకి రీమేక్ ఇది.
 
సమ్మర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... కుదరలేదు. అయితే... ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ముందుగా టాలీవుడ్ కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసారు.  ఇప్పుడు నారప్ప కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అక్టోబర్ నుంచి నారప్ప షూటింగ్‌లో వెంకీ పాల్గొంటారు. 
 
అక్టోబర్ చివరికి షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఇక ఎఫ్ 3 విషయానికి వస్తే... అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్ర్కిప్ట్ ఎప్పుడో రెడీ చేసాడు. నవంబర్ నుంచి ఎఫ్ 3 స్టార్ట్ చేయడానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రేజీ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నారు.
 
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2021 మేలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. ఎఫ్ 3, వెంకీమామ... ఇలా వరుసగా సక్సస్ సాధిస్తున్న వెంకీ నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో కూడా సక్సస్ సాధిస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments