Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శుభాకాంక్ష‌లు తెలుపుతుంది ఎవ‌రికో తెలుసా!

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (23:02 IST)
Anuksha with parents
‌న‌టి అనుష్క శెట్టి చాలాకాలంగా మీడియాకు దూరంగా వుంది. 2019లో సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో ఝాన్సీ ల‌క్ష్మీభాయ్‌గా న‌టించింది. క‌రోనా టైంలో 2020లో న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా ఓటీటీ ద్వారా ఐదు భాష‌ల్లో విడుద‌లైంది. అయితే ఆ సినిమా త‌ర్వాత ఆమె అస్స‌లు ఎలా వుందో కూడా సోష‌ల్‌మీడియాలో త‌న ఫొటోలు పెట్ట‌లేదు. కొన్ని కార‌ణాల‌వ‌ల్ల సినిమాల‌కూ దూరంగా వుంటున్న‌ట్లు చెప్పింది. కానీ అనుష్క‌కు జీరో సైజ్ సినిమా నేప‌థ్యంలో వైవిధ్య‌మైన పాత్ర కోసం త‌న బాడీ విప‌రీతంగా పెంచుకుంది. ఆ త‌ర్వాత దానిని కంట్రోల్ చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది.

ఈ క్రమంలో ఆమెకు తెలిసిన విద్య యోగా. యోగా ద్వారా ప‌లు వ్యాయామాలు చేస్తూ నియంత్రించుకుంది. త్వ‌ర‌లో పేద్ద బేన‌ర్ సినిమాలో న‌టించ‌డానికి రంగం సిద్ధం అయిన‌ట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అవేవీ ప్ర‌క‌ట‌న‌ల‌కు నోచుకోలేదు. ఏదో కార‌ణంగా అనుష్క ప్ర‌చారానికి దూరంగా వుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే తాజాగా మంగ‌ళ‌వారంనాడు త‌న త‌ల్లిదండ్రుల‌కు వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా పాత ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పెట్టి వారికి శుభాకాంక్ష‌లు తెలిపింది. తుళు భాష‌లోనూ, ఆంగ్లంలోనూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. బెంగుళూరుకు చెందిన అనుష్క త్వ‌ర‌లోనే అ్ర‌గ హీరో స‌ర‌స‌న చేయ‌నుంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments