ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

డీవీ
గురువారం, 30 జనవరి 2025 (19:23 IST)
Prabahs
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సినిమాలతో బిజీగా వున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఫిలింసిటీలో ప్యాచ్ వర్క్ కూడా కొనసాగుతుంది. ఈ సినిమా అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ని తెరకెక్కిస్తున్నాడు. అజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతోపాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాను చేస్తున్నాడు ప్రభాస్ తెలిపాడు.
 
కాగా, ఈ సినిమా కోసం మార్చిలో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఇందులో యాక్షన్ సీన్స్ కూడా వుంటాయి. ప్రభాస్ సినిమా అనగానే యాక్షన్ ఎపిసోడ్ కంపల్ సరి. ఇటీవలే ఫౌజీ సినిమా షూట్ లో మాదాపూర్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. బాలీవుడ్ కు చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్లతో తీసిన ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ పై క్లోజ్ షాట్స్ తీసినట్లు తెలిసింది. మిగిలిన యాక్షన్ పార్ట్ బాహుబలిలో డూప్ గా చేసిన నర్సింహ అనే వ్యక్తితో చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతను డిటో ప్రభాస్ మాదిరిగానే వుంటాడని తెలిసిందే. దానికి కారణం కాలికి గతంలో అయిన గాయం ఇంకా తగ్గకపోవడమేఅని తెలుస్తోంది. కాగా, సందీప్ రెడ్డి సినిమా రెండేళ్ళపాటు చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్టుబడులు ఆకర్షించడంలో నవ్యాంధ్ర టాప్ : ఫోర్బ్స్ కథనం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశాలు

సోమనాథ్ ఆలయంలో అంబానీ దంపతుల పూజలు - రూ.5 కోట్ల విరాళం

నా అభిప్రాయాలు భార్యకు నచ్చవు : విదేశాంగ మంత్రి జైశంకర్

Nizamabad: నిజామాబాద్‌ను కమ్మేసిన పొగమంచు.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు

మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం

అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?

కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments