Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్

Advertiesment
nidhi agerwal

ఠాగూర్

, సోమవారం, 13 జనవరి 2025 (17:47 IST)
కెరీర్ పరంగా తనకు ఎలాంటి గ్యాప్ రాలేదని, కానీ, కరోనా మహమ్మారి కారణంగా అమలు చేసిన లాక్డౌన్ వల్ల చిన్నపాటి గ్యాప్ వచ్చిందని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, ఆమె నటించిన చిత్రం గత 2022లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రం విడుదలకాలేదు. దీనిపై ఆమె స్పందించారు. తాను కావాలని ఆ గ్యాప్ తీసుకోలేదదని.. కొన్ని కారణాల వల్ల వచ్చిందన్నారు. ఈ యేడాది రానున్న రెండు సినిమాలపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించారు. 
 
'తొలి లాక్డౌన్ ముందే 'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్ కోసం సంతకం చేశా. ఆ సమయంలో కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ లేదు. కొంతకాలానికి లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత షూట్ మొదలు పెట్టి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. రెండోసారి కరోనా కారణంగా షూట్ నిలిపివేశాం. చిత్రీకరణ సమయంలో దాదాపు మూడున్నర సంవత్సరాలు గడిచి పోయింది. వేరే చిత్రాలకు సంతకం చేయొద్దని టీమ్ నాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 
 
'ది రాజాసాబ్‌లో అవకాశం వచ్చినప్పుడు 'హరి హర వీరమల్లు' టీమ్‌ను సంప్రదించా. అందులో భాగం కావాలనుకుంటున్నానని చెప్పా. వాళ్లు దానికి అంగీకరించారు. అలా, రెండు ప్రాజెక్టుల్లో భాగమయ్యాను. ఈ రెండింటిపై పూర్తి నమ్మకంతో ఉన్నా' అని నిధి అగర్వాల్ వివరించారు. కెరీర్ గురించి ఆలోచించి తాను కొన్నిసార్లు బాధపడ్డానని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే తాను బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నానని తెలిపారు.
 
'చిన్నతనం నుంచి నేను సన్నగానే ఉండేదాన్ని. చుట్టూ ఉన్న వాళ్లు లావుగా మారాలని సలహా ఇచ్చేవారు. కరోనా సమయంలో పలు కారణాల వల్ల కాస్త బొద్దుగా అయ్యా. దానిని చూసి నువ్వెందుకు ఇలా అయ్యావు? అని వాళ్లే కామెంట్ చేశారు. ఇపుడు అన్నీ సర్దుకున్నాయి' అని ఆమె చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాధ రావు