Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసు చంపుకుని ఆ హీరోతో చేయను - దీపికా పదుకొనె

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అంటే హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సినీ ప్రేక్షకులకు తెలుసు ఆయన నటించిన సినిమాలు, సాధించిన విజయాలు అన్నీఇన్నీ కావు. కాజోల్, షారుక్ ఖాన్‌ల జోడి అప్పట్లో సంచలనమే. వీరి సినిమా అంటే ప్రేక్షకులు పడి చ

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (18:22 IST)
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అంటే హిందీలోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సినీ ప్రేక్షకులకు తెలుసు ఆయన నటించిన సినిమాలు, సాధించిన విజయాలు అన్నీఇన్నీ కావు. కాజోల్, షారుక్ ఖాన్‌ల జోడి అప్పట్లో సంచలనమే. వీరి సినిమా అంటే ప్రేక్షకులు పడి చచ్చిపోయేవారు. ఆ తరువాత షారుక్‌-దీపికా పదుకొనె జోడి చాలా బాగుందని ప్రేక్షకులు ఆనందపడ్డారు. ఇప్పటికే వీరిద్దరు కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి.
 
ఐదో సినిమా జబ్ హ్యారి మెట్ సెజల్ ఆనంద్ రాయ్ దర్సకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా దీపికా పదుకొనె నటిస్తోంది. అయితే ఇదే షారుక్ ఖాన్‌తో నటించే తన చివరి సినిమా అని చెప్పేసిందట దీపికా. ఎందుకిలా దీపికా చెబుతోందని తన స్నేహితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తే వృద్ధ హీరోలతో చేస్తే క్రేజ్ తగ్గిపోతోందనీ, యువ హీరోలతో ఏదైనా చేయాలనీ, హిట్ కోసమని మనస్సు చంపుకుని నేను ఆ వృద్ధ హీరోలతో చేయలేను అంటూ దీపికా చెప్పేసిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments