వర్మకు సైతం కన్నీళ్లు తెప్పించినది ఎవరు???

రామ్‌గోపాల్ వర్మ అంటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. అంతా నా ఇష్టం అంటూ తన సినిమాలతో, ట్విట్టర్‌లో తన ట్వీట్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటివరకూ ఏవేవో సినిమాలు తీసి, ఇప్పుడు గత కొంతకాలంగా జ

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (12:14 IST)
రామ్‌గోపాల్ వర్మ అంటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. అంతా నా ఇష్టం అంటూ తన సినిమాలతో, ట్విట్టర్‌లో తన ట్వీట్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటివరకూ ఏవేవో సినిమాలు తీసి, ఇప్పుడు గత కొంతకాలంగా జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీసి, వాటి ద్వారా మరిన్ని హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రేరేపితులయ్యారు. 
 
గతంలో పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'రక్త చరిత్ర' సినిమా బాగానే ఆడింది, కానీ ఆ తర్వాత అందులోని ఒక కీలక వ్యక్తి అయిన మద్దెలచెరువు సూరిని అతి కిరాతకంగా చంపారు. తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీయార్' చిత్రం టైటిల్‌ ప్రకటించి, తెలుగుదేశం కార్యకర్తల నుంచి బెదిరింపులను అందుకున్నారు. కానీ వీటికి తాను ఎన్నడూ బయపడలేదని, ఇకపై కూడా అలా ఉండబోయేది లేదంటూ తెగేసి చెప్పారు. 
 
ఇలా ఎంతటి వారికైనా తనదైన స్టయిల్‌లో సమాధానమిచ్చే వర్మ, ఒక ప్రైవేట్ ఛానెల్‌లో వ్యాఖ్యాత తన కూతురు గురించి అడగగానే, వర్మకు గొంతులో వెలక్కాయపడినట్లుగా సమాధానం చెప్పడం మరీ కష్టంగా భావించి, 'నా ఇష్టం' అంటూ సమాధానాన్ని దాటవేసారు. అప్పుడు తన ముఖకవలికలు గమనించిన వారు ఎవ్వరైనా తనలో కూడా తన కూతురుపై ఉన్న మమకారం ఇట్టే అర్థమౌతుంది. ఇలా పరమ కర్కోటకుడిలా కనబడే వర్మకు సైతం కన్నీళ్లు తెప్పించిందంటే, తండ్రీ కూతురికి ఉన్న అనుబంధాలు అలాంటిదని నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments