Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పుణ్యమాని తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్!

Coronavirus
Webdunia
గురువారం, 26 మార్చి 2020 (15:47 IST)
కరోనా వైరస్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో అత్యవసర సేవలు మినహా అన్ని రంగాలు మూతపడ్డాయి. అలాగే, దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ ద్వారా లభించిన ఖాళీ సమయంలో పలువురు సెలెబ్రిటీలు తమ ఇంటి పనులను చక్కబెట్టుకుంటున్నారు. మరికొందరు తమకు నచ్చిన పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. 
 
అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తెలుగులో వరుస ఆఫర్లు కొట్టేస్తున్న ఈ భామకు తెలుగురాదు. దీంతో విరామ స‌మ‌యంలో తెలుగు భాష‌పై ప‌ట్టు సాధించే ప‌నిలో నిమగ్నమైపోయిందట. 
 
ఆమె వెండితెరకు పరిచయమైనప్పటి నుంచి సినిమా షూటింగ్‌లతో నిత్యం బిజీగా గడిపేది. అందుకే అపుడు తెలుగు నేర్చుకోలేక పోయింది. ఇపుడు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆమె ప్రణాళికలు రచించుకుంది. ఇందులోభాగంగా తెలుగు నేర్చుకునేందుకు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోందట. 
 
ఇందుకోసం ఓ స్పెషల్ ట్రైనర్‌ను నియమించుకుని తెలుగు ప‌దాలు స్ప‌ష్టంగా ప‌ల‌క‌డంపై దృష్టిసారిస్తున్న‌ట్లు సమాచారం. సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌నే ఆలోచ‌న‌తో పాటు తెలుగులో క‌థానాయిక‌గా పూర్తిస్థాయిలో నిల‌దొక్కుకోవాల‌న్న ఏకైక లక్ష్యంతో ముందుకుసాగుతోంది. 
 
ప్ర‌స్తుతం పాయ‌ల్ రాజ్‌పుత్ తెలుగులో "ఫైవ్ డ‌బ్య్లుఎస్" అనే సినిమాలో న‌టిస్తున్న‌ది. మ‌హిళా ప్ర‌ధాన ఇతివృత్తంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఐపీఎస్ అధికారిణిగా కనిపించనుంది. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులు అంగీకరించినప్పటికీ వాటిని ఆయా నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments