బన్నీ మూవీకి కరోనా ఎఫెక్ట్, షెడ్యూల్ క్యాన్సిల్

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (16:52 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్... అల.. వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల.. వైకుంఠపురములో బన్నీ స్టైలీష్ యాక్షన్‌తో అదరగొట్టేసాడు. క్లాస్ మూవీ అనే టాక్ వచ్చినా.. మాస్‌లో ఉన్న ఇమేజ్‌తో తన సత్తా చూపించాడు. బాక్సాఫీస్ వద్ద లెక్కలు సరిచేసాడు. అల.. వైకుంఠపురములో తర్వాత బన్నీ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. అయితే.. అల.. వైకుంఠపురములో రిలీజ్ తర్వాత సుకుమార్ ఆలోచనలో మార్పు వచ్చిందని తెలిసింది.
 
ఎందుకంటే... ఎవరూ ఊహించని విజయం సాధించడంతో.. బన్నీని ప్రేక్షకాభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఇంకాస్త క్లారిటీ వచ్చిందని.. దీనికనుగుణంగా ఈ కథలో సుకుమార్ మార్పులు చేసారని టాక్ వచ్చింది. ఇంతకీ సుక్కు చేసిన మార్పులు ఏంటంటే... బన్నీ నుంచి అభిమానులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా కామెడీ డోస్ పెంచారని.. సినిమా సీరియస్‌గా వెళుతున్నా.. ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ లేకుండా ఉండేలా కథ పై మళ్ళీ కసరత్తు చేసారని తెలిసింది. ఇదిలా ఉంటే... తాజాగా భారీ మార్పు జరిగినట్టు టాక్.
 
ఇంతకీ ఏంటంటే.. మార్చి 15 నుంచి కేరళలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు. సుకుమార్ తన టీమ్‌తో కేరళ వెళ్లి తనకు కావాల్సిన లోకేషన్స్ చూసి అంతా సెట్ చేసుకున్నారు. ఇక ఈ నెల 15 నుంచి రంగంలోకి దిగి షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ పైన కీలక సన్నివేశాలను చిత్రీకరించాలి అనుకున్నారు. అయితే.. ప్రస్తుతం వాతావారణం అనుకూలంగా లేకపోవడం.. కేరళలో వైరస్ ఎక్కువుగా ఉండడం వలన కేరళలో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ చేసారని సమాచారం. ఈ షెడ్యూల్‌ను రాజమండ్రి దగ్గరలో గల మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చేయనున్నారు.
 
కేరళలో మార్చి 15 నుంచి ప్రారంభించాలి అనుకున్న షూటింగ్‌ని మార్చి 20 నుంచి మారేడుమిల్లిలో స్టార్ట్ చేయనున్నారు. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ రాయలసీమ యాసలో మాట్లాడతారు. అందుకనే రాయలసీమ స్లాంగ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. క్రేజీ హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో నటిస్తుంది. సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టర్.. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అలాగే నెగిటీవ్ షేడ్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇందులో బన్నీ పాత్రను సుకుమార్ మార్క్‌లో చాలా వైవిధ్యంగా డిజైన్ చేసినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి నారా లోకేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం.. ఈసీ సీరియస్ వార్నింగ్

తమిళనాడులో హిందీ భాషపై నిషేధమా? ఎవరు చెప్పారు? సీఎం స్టాలిన్ వివరణ

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తను హత్య చేయించిన భార్య

పోటీ పరీక్షల్లో సెక్స్‌కు సంబంధించిన మార్కులు కూడా వస్తాయంటూ... విద్యార్థినిలకు టీచర్ వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments