Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరోయిన్‌కు లైంగిక వేధింపులు... హాలీవుడ్ నిర్మాతకు 23 యేళ్ల జైలు

హీరోయిన్‌కు లైంగిక వేధింపులు... హాలీవుడ్ నిర్మాతకు 23 యేళ్ల జైలు
, గురువారం, 12 మార్చి 2020 (10:36 IST)
పలువురు హీరోయిన్లతో పాటు.. సహాయ నటీమణులను లైంగికంగా వేధించినట్టు వచ్చిన ఆరోపణలు నిరూపితం కావడంతో హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌కు 23 యేళ్ళ జైలుశిక్ష పడుతూ న్యూయార్క్ కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ కేసు తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌ పలు చిత్రాలను నిర్మించారు. ఈయన దాదాపు 90 మందిని శారీరకంగా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సినిమా అవకాశాలను ఎరజూపిన హార్వీ తమను మోసం చేశాడంటూ ఎంతో మంది ఫిర్యాదులు చేశారు. 
 
గత సంవత్సరం ఫిబ్రవరిలో 12 మంది సభ్యుల జ్యూరీ విచారణ చేపట్టి, అన్నీ వాస్తవాలేనని తేల్చింది. హార్వీ చేత వేదింపులు ఎదుర్కోబడిన వారిలో ఏంజెలినా జోలీ, సల్మా హయక్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. 
 
ఇదే అంశంపై ఆయనపై పలువురు కేసుకూడా పెట్టారు. వీటిపై కోర్టులో విచారణ జరిగింది. ఈ నిర్మాతపై వచ్చిన ఆరోపణలు కోర్టులో నిరూపితమయ్యాయి. దీంతో 23 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పిచ్చింది. 
 
హార్వీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల శిక్ష మాత్రమే విధించాలని ఆయన తరపు లాయర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి జేమ్స్ బుర్కే తోసిపుచ్చారు. వాస్తవానికి ఆయనకు 29 సంవత్సరాల శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అంచనా వేసినా, సమాజానికి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని కొంత శిక్షను తగ్గించామని న్యాయస్థానం పేర్కొంది.
 
కాగా, ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన హార్వీ, వీల్ చైర్‌లోనే కోర్టుకు హాజరయ్యారు. తీర్పు అనంతరం మాట్లాడిన ఆయన, తనకంతా అయోమయంగా ఉందని, ప్రస్తుతం తాను దేశం కోసం బాధపడుతున్నానని అన్నారు. కాగా, నేడు ప్రపంచ వ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం విస్తరించడానికి నాంది పలికిన సంఘటనగా హార్వీ కేసు పేరుతెచ్చుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్ హీరో దంపతులకు కరోనా వైరస్