స్ట్రీమింగ్ యాప్ ద్వారా తెలుగు చిత్రాలు రిలీజ్?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (08:53 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేసింది. ఈ వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలే సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించాయి. పైగా, ఈ వైరస్ ప్రభావం ఎపుడు తగ్గుతుందో తెలియదు. పైగా, లాక్‌డౌన్ కూడా ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి అపారనష్టం వాటిల్లింది. ముఖ్యంగా, మార్చి నెలలో విడుదల కావాల్సిన అనేక చిత్రాలు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ భయంతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేయడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 
 
అయితే, ఇపుడు ఏప్రిల్ నెల 14వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా ఇది కొనసాగవచ్చనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈ నెలాఖరు వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర నిర్మాతలు సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో బొమ్మ పడే సూచనలు లేనికారణంగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదలకావాల్సిన చిత్రాలను థియేటర్స్‌లో కాకుండా, స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కరోనా కారణంగా లాక్ అయిన పరిస్థితులు మళ్లీ ఎప్పుడు యథా స్థితికి వస్తాయో అని ఆలోచిస్తున్న వారంతా ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేయనున్నారని టాలీవుడ్‌లో వినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments