Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైస్ పుల్లింగ్‌తో రూ.26 కోట్ల మోసం.. జయచిత్ర కుమారుడు అరెస్టు!

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (20:04 IST)
రైస్ పుల్లింగ్ పేరుతో రూ.26 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో సీనియర్ నటి జయచిత్ర కుమారుడు, సినీ సంగీత దర్శకుడు అమ్రేష్‌ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సీనియర్‌ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్‌.. నటుడిగా పలు చిత్రాలలో నటించారు. చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ అనే వ్యక్తిని రైస్‌ పుల్లింగ్‌ పేరుతో రూ.26 కోట్లకు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ప్రస్తుతం అమ్రేష్‌ను ఇదే విషయమై చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ జరుపుతున్నారు. 
 
అమ్రేష్‌ తన స్నేహితులతో కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి నెడుమారన్‌ను రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మాయ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడట. రైస్‌ పుల్లింగ్‌ కలశం అని చెప్పి, అది ఇంటిలో ఉంటే.. ప్రపంచాన్ని జయించవచ్చని తెలుపుతూ.. 8 సంవత్సరాలుగా మోసం చేస్తూ.. ఇప్పటివరకు రూ.26 కోట్లను నెడుమారన్‌ నుంచి వసూలు చేశారట. 
 
రైస్‌ పుల్లింగ్‌ కలశం ఇంటిలో పెట్టుకున్నా.. ఎటువంటి మార్పు లేకపోవడంతో.. వెంటనే నెడుమారన్‌ సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అమ్రేష్‌ను, అతని సన్నిహితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కోలీవుడ్‌ అంతా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. అయితే, ఈ వ్యవహారంపై జయచిత్ర ఇప్పటివరకు స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments