Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు హీరోయిన్ల ముద్దుల హీరోగా అక్కినేని నాగచైతన్య

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (19:57 IST)
అక్కినేని నాగచైతన్య వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ సాయిపల్లవి. అలాగే థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. 
 
శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డిలు కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చైతూ మూడు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో కనిపిస్తాడని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చైతూ సరసన ముగ్గురు హీరోయిన్లు ఉంటారని ఈ ముగ్గురిలో.. ఒక స్టార్ హీరోయిన్ మిగిలిన ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే మేయిన్ లీడ్ రోల్‌కి ముందు సమంత పేరు వార్తల్లో నిలిచింది.
 
ఆ తర్వాత దిల్ రాజు.. పూజా హెగ్డే, రష్మిక మందన్నలలో ఒకర్ని తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా హీరోయిన్స్ ఎవరన్నది మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్ర్రమంలో 'థాంక్యూ' సినిమాలో ఒక హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటించే అవకాశాలున్నాయని సమాచారం. 
 
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభాకి మళ్ళీ సాలీడ్ హిట్ దక్కలేదు. చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. ప్రస్తుతం నభా చేతిలో నితిన్ సినిమా ఒక్కటే ఉంది. ఇలాంటి సమయంలో నభాకి చైతూ సినిమాలో అవకాశం వస్తే గొప్పే. మరి ఇది వాస్తవమా కాదా అన్నది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments