Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అదిరింది'తో చమ్మక్ చంద్రా డబుల్ ధమాకా, ఎలాగో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (20:13 IST)
జబర్దస్త్ షో నుంచి పాపులర్ అయిన కమెడియన్ చమ్మక్ చంద్ర. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి అదిరింది షోకు వచ్చేసాడు ఈయన. చంద్ర స్కిట్స్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ స్కిట్స్ చేయడంలో ఈయనకు తిరుగులేదు. ఎంతమంది ఉన్నా కూడా చంద్ర స్కిట్ వచ్చిందంటే చాలు అది మరో స్థాయిలో ఉంటుంది. ఇప్పటికీ చంద్ర పాత స్కిట్స్ కూడా జబర్దస్త్ రిపీట్ షోలో కేక పెట్టిస్తున్నాయి. అంతటి క్రేజ్ ఉన్న కమెడియన్‌ను ఓ షో చేయాలంటే చాలానే ఇచ్చుకోవాలట.
 
చమ్మక్ చంద్ర కామెడీ స్కిట్ ఈయన ఛానెల్ మారడానికి చాలానే తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ నుంచి తన కేరాఫ్ అడ్రస్ అదిరిందికి మార్చుకోడానికి చంద్ర ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు కాల్షీట్ కోసం దాదాపు 3 లక్షల వరకు చెల్లించేవారని.. అలాంటి నాలుగు కాల్షీట్స్ నెలకు ఉండేవని తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు జీ తెలుగులో మాత్రం అదిరింది కోసం ఒక్కో కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు జబర్ధస్త్‌కు డబుల్ అన్నమాట. అది కూడా నాగబాబు ఇచ్చిన హామీ మీదే ఛానెల్ మారాడంట చమ్మక్ చంద్ర. 
 
జబర్దస్త్ షో నాగబాబు చమ్మక్ చంద్ర ఈమధ్యే ఇంటర్వ్యూలో కూడా నాగబాబు చెప్పిన కారణంగానే తాము మారాం కానీ మల్లెమాలతో ఎలాంటి గొడవల్లేవని క్లారిటీ ఇచ్చాడు చమ్మక్ చంద్ర. ఈయనతో పాటు వచ్చిన కిరాక్ ఆర్పీకి కూడా బాగానే హైక్ ఇచ్చింది జీ తెలుగు. అయితే చంద్ర రేంజ్ మాత్రం కాదు. ప్రస్తుతం వస్తున్న అదిరిందిలో చమ్మక్ చంద్ర హైయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా ఉన్నాడు. 
 
జబర్ధస్త్‌కు పని చేసిన నితిన్, భరత్ దీనికి దర్శకులు. మొత్తమ్మీద ఛానెల్ మారడానికి చాలా ఆలోచించామని.. అయినా కూడా మంచి కార్యక్రమం కాబట్టే ధైర్యం చేసామని చెబుతున్నాడు చంద్ర. ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోతో తనకు మంచి అనుబంధమే ఉందంటున్నాడు చమ్మక్ చంద్ర.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments