Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనసూయ, రష్మికి పోటీగా వచ్చిన కొత్త యాంకరమ్మ... (వీడియో)

Advertiesment
అనసూయ, రష్మికి పోటీగా వచ్చిన కొత్త యాంకరమ్మ... (వీడియో)
, శుక్రవారం, 27 డిశెంబరు 2019 (14:36 IST)
జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కామెడీ షోలో వేస్తున్న పంచ్‌లకు కాసేపు నవ్వుకుని వదిలేద్దాంలే అనుకునే ప్రేక్షకులతో పాటుగా ఈ షోలో వల్గర్ పంచ్‌లు, అక్రమ సంబంధాలు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, వ్యంగ్యస్త్రాలు ఎక్కువయ్యాయని చెప్పే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే కొద్ది కాలం క్రితం జబర్దస్త్ జడ్జ్ నాగబాబు సంచలనాత్మకంగా అందులో నుండి తప్పుకున్నారు.
 
అయితే జబర్దస్త్ షోకి పోటీగా అచ్చం దానికి జిరాక్స్ లాగా అనిపించే మరొక షో జీ తెలుగులో ఇటీవల ప్రారంభమైంది. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన నాగబాబు, చమ్మక్ చంద్ర, ధనరాజ్, వేణు, కిర్రాక్ ఆర్పీలు ఈ ‘అదిరింది’ షోతో కామెడీగా చేయడానికి సిద్ధమయ్యారు. మొదటి ఎపిసోడ్‌లో జడ్జిలుగా నాగబాబు, ఆయన కూతురు నిహారిక ఉండగా, రాజ్ తరుణ్ స్పెషల్ పెర్ఫామెన్స్ చేసారు.
 
ఈ కామెడీ షోకి యాంకర్‌గా టీవీ నటి సమీరను ఇంట్రడ్యూస్ చేసారు జీ తెలుగువారు. జబర్దస్త్ అంత హిట్ కావడానికి కామెడీతో పాటుగా యాంకర్ రష్మి, అనసూయ గ్లామర్ షో కూడా కారణమని ఒప్పుకుని తీరాల్సిందే. మరి సమీర ఆ రేంజ్‌లో పేరు తెచ్చుకుంటుందో లేదో తెలియదు గానీ అప్పుడే వల్గర్ పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు మొదలుపెట్టింది.
 
నాగబాబు సంగతి పక్కనపెడితే.. గత ఆదివారం నాడు తొలి ఎపిసోడ్ ప్రారంభం కాగా.. ‘అదిరింది’ సేమ్ టు సేమ్ జబర్దస్త్ మాదిరే ఉందనే విమర్శలు వినిపించాయి. ఇక ఈ షోకి యాంకర్‌గా టీవీ నటి సమీరను తీసుకువచ్చారు. ఒకవైపు జబర్దస్త్ షోతో యాంకర్ రష్మి, అనసూయ తమ గ్లామర్ షోతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటే.. వీరికి పోటీగా సమీరను రంగంలోకి దింపింది జీ తెలుగు 
 
ఆడపిల్ల, అభిషేకం, భార్యామణి, ప్రతిబింబం, మంగమ్మగారి మనవరాలు తదితర సీరియల్స్‌లో నటించి మెప్పించింది సమీర. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ సీరియల్ నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సీరియల్స్‌కి గ్యాప్ ఇచ్చిన సమీర జీ తెలుగు ‘అదిరింది’ కామెడీ షోతో అదరగొట్టేందుకు స్టేజ్ మీదికి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్విపాత్రాభినయంతో మెప్పించనున్న హీరో...