Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు - అఖిల్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్.. డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

Chaitu-Akhil movie
Webdunia
శనివారం, 27 జులై 2019 (22:23 IST)
అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి న‌టించిన సంచ‌ల‌న చిత్రం మ‌నం. ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొంది ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది. ఇందులో నాగార్జున‌, చైత‌న్య న‌టించ‌గా చివ‌రిలో అఖిల్ మెరుపు తీగ‌లా క‌నిపించి ఆడియ‌న్స్‌కి థ్రిల్ క‌లిగించాడు. ప్ర‌స్తుతం చైత‌న్య వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. అఖిల్ గీతా ఆర్ట్స్‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. 
 
అయితే.. ఇప్పుడు చైత‌న్య - అఖిల్ కాంబినేష‌న్లో మూవీ ప్లాన్ జ‌రుగుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
ఇంత‌కీ... ఈ క్రేజీ మూవీకి డైరెక్ట‌ర్ ఎవ‌రంటారా..? చి.ల.సౌ, మ‌న్మ‌థుడు 2 చిత్రాల ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్. అవును.. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. చి.ల‌.సౌ సినిమాతో మోస్త‌రు విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న రాహుల్ ర‌వీంద్ర‌న్‌కి రెండో సినిమాతోనే నాగార్జున‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కింది. 
 
రాహుల్ వ‌ర్క్ ప‌ట్ల అన్న‌పూర్ణ స్టూడియోస్ హ్యాపీ అట‌. కాబ‌ట్టి, ఈ అక్కినేని మల్టీస్టార‌ర్‌కు రాహుల్ అయితే బెట‌ర్ అనుకుంటున్నార‌ని టాక్‌. ఈ అక్కినేని హీరోలిద్ద‌రిని మేనేజ్ చేయ‌డం అంటే అంత ఈజీ కాదు. అస‌లు ప్ర‌చారంలో ఉన్న వార్త నిజ‌మేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments