Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బయోపిక్‌ల గోల... లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నిజమెంత??

Advertiesment
బయోపిక్‌ల గోల... లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నిజమెంత??
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:00 IST)
బయోపిక్‌ల మాట దేవుడెరుగు... ఆ పేరుతో ఎవరికి వారు తమ సొంత డబ్బాలు తెగ కొట్టేసుకుంటూ తామే మంచివాళ్లమనే ముద్ర వేసేయాలనే ప్రయత్నాలు చేసేస్తున్నారు... ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ... తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయంటే దానికి కారణం రామ్ గోపాల్ వర్మే...
 
తమ పార్టీ వ్యవస్థాపకుడు... స్వర్గీయ ఎన్టీఆర్ పేరిట బాలయ్య బాబు చేసిన సినిమాలలోని రెండు భాగాలూ సామాన్య ప్రజల మాట అటుంచి పార్టీ కార్యకర్తలకే మింగుడు పడడం లేదనేది... బాహాటంగానే చర్చించుకుంటున్నారు... సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవన ప్రస్థానాన్ని చూపిస్తాడని ఆశపడిన సగటు ప్రేక్షకుడైనా, కార్యకర్త అయినా... అటువంటి ప్రయత్నాలు ఏవీ లేకుండా కేవలం బాలయ్య బాబు చేసే రికార్డ్ డ్యాన్స్‌లకే సినిమాని పరిమితం చేసేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నాడు.
 
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎక్కడ బయటపడుతుందోననే భయం... ఆ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుండి తెదేపా నాయకులకు నిద్రపట్టనివ్వడం లేదు... అయితే... ప్రస్తుత తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుని విలన్‌గా లక్ష్మీపార్వతిని మహోన్నత వ్యక్తిగా చూపించే ఆ సినిమా కూడా పూర్తి నిజాలతో ఏమీ లేదనీ.. అప్పట్లో పార్టీలో ఆడ పెత్తనం ఎక్కువగానే ఉండిందనీ.. ఒకవేళ చంద్రబాబు నాయుడు చొరవ చేసి ఉండకపోతే.. తెదేపా కాస్తా లక్ష్మీస్ తెదేపా అయిపోయి ఉండేదని కొందరు సీనియర్ నాయకుల వాదన. దీనికి నిదర్శనంగా అప్పట్లోనే తనకు మంత్రి పదవి రావలసిందనీ, దానికి లక్ష్మీపార్వతి అడ్డుపడ్డారని ఇటీవలి కాలంలో తెరాసలో మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటనని చూపిస్తున్నారు.
 
అయితే ఎవరి వాదనలు వాళ్లు వినిపించేస్తూ, ఓటర్ల ముందు మేమే మంచి అని చెప్పేసుకుంటూ ఉంటే... ఈ అన్ని కథనాలనూ విన్న సగటు ఓటరు ఏమైపోతాడే మాత్రం తెలియడం లేదు...
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను బైసెక్సువల్..మీరు కూడా... బాలీవుడ్ సెన్సేషన్ బోల్డ్ స్టేట్‌మెంట్