Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై.. శ్రీరెడ్డి కామెంట్స్.. వామ్మో ఉతికేసింది..

Advertiesment
లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై.. శ్రీరెడ్డి కామెంట్స్.. వామ్మో ఉతికేసింది..
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (20:20 IST)
ఎన్టీఆర్ బయోపిక్‌ కథానాయకుడు, మహానాయకుడుగా రెండు భాగాలుగా విడుదలయ్యాయి. నందమూరి హీరో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌ని మొదలు పెట్టిన సమయం‌లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రారంభించి మధ్యలోనే ఆపేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.


ఈ నేపథ్యంలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమాను మొదలుపెట్టి.. అందులో లక్ష్మీపార్వతిగా ఐశ్వర్యారాయ్‌ని తీసుకుంటానని అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ సినిమాను నిలిపి వేయడంతో కేతిరెడ్డి కూడా తన సినిమాని ఆపేశాడు. 
 
ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌ను శరవేగంగా ముందుకు తీసుకెళ్లడం.. ఆ సినిమాలోని పాటలు, ట్రైలర్, డైలాగులను అప్పుడప్పుడు పోస్టు చేస్తుండటంతో కేతిరెడ్డి మళ్లీ లక్ష్మీస్ వీర గ్రంథాన్ని తెరపైకి తెచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. 
 
కేతిరెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథంలో లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి నటించబోతుందని చెన్నై ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందుకు జరిగిన అంశాలతో తాను సినిమా రూపొందించనున్నట్లు కేతిరెడ్డి ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు రావడం వివాదానికి తావిచ్చింది.
 
ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారికి రెండు కోణాలు సహకరించి వుంటారని.. అందులో ఆమె రాజకీయ లబ్ధి కూడా వుండివుండచ్చునేమోనని చెప్పారు. అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో వర్మ లక్ష్మీ పార్వతిలో వున్న ప్లస్ పాయింట్స్ చూపిస్తే.. కేతిరెడ్డిగారు ఆమెలో వున్న మైనస్ పాయింట్స్ చూపించాలనుకుంటున్నారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. 
 
వీరిద్దరూ తీసే సినిమాలు తప్పు అని తాను చెప్పట్లేదని శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చేసింది. కేతిరెడ్డి గారూ అడిగితే.. క్యారెక్టర్ పరంగా ఎలాంటి రోలైనా చేసిపెడతానని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. లక్ష్మీ పార్వతి తన భర్తను వదిలి, కుమారుడిని వదిలి వచ్చిన ఆమెలోని నెగటివ్ పాయింట్స్‌ను కేతిరెడ్డి ఈ సినిమాలో చూపించారని శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాశి - రంభలకు షాక్.. వారిద్దరి వాణిజ్య ప్రకటనలు వద్దనే వద్దు