నటి హేమ పేరు చెబితేనే చాలా బోల్డుగా మాట్లాడుతుంటారని చెపుతారు. నిజంగా మరోసారి అలాగే మాట్లేడేసారు నటి హేమ. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే.. ఓ యూ ట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ #MeToo గురించి స్పందించారు. కెరీర్ కోసం ఏదో చేసుకోవడం తప్పని నామటుకు నేను అనుకోవడం లేదని అన్నారు.
అసలు ఓ అవసరం కోసం, కెరీర్ కోసం ఏదో చేసి, వాడు నన్ను గోకాడు, ఇలా అన్నాడంటూ దానికి మీటూ అని చెప్పడం కరెక్ట్ కాదంటూ వెల్లడించింది. అసలు సినిమా ఇండస్ట్రీయే కాదు... బయట కూడా చాలానే జరుగుతున్నాయనీ, మరి అలాంటి వాటి సంగతి ఏంటని ప్రశ్నిస్తోంది.
ఆ శ్రీరెడ్డి చేసిన హంగామాకు ఇప్పుడు హైదరాబాదులో సినిమా వాళ్లకు ఇళ్లు అద్దెకు దొరకడంలేదంటూ చెప్పుకొచ్చింది. స్త్రీలు, పురుషులు కలిసి పనిచేసే చోట సహజంగానే కొన్ని ఇబ్బందులు వుంటాయనీ, ఎవడైనా తేడాగా ప్రవర్తిస్తే వాడి పట్ల కఠినంగా వుంటే ఇక అతడు భయపడతాడంటూ చెప్పిన హేమ... ఇండస్ట్రీలు చాలామంచివాళ్లున్నారని వ్యాఖ్యానించింది.
సినిమా ఇండస్ట్రీలో ఎవరూ రేప్ చేయరనీ, కెరీరో కోసం తమకు తామే సమర్పించుకుంటే అది వాళ్ల తప్పెలా అవుతుందని ప్రశ్నించింది హేమ. ఒకవేళ ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే అతడితో తనకు ఇష్టం లేదని చెప్పుకునే మాట ఒకటుందని చెప్పుకొచ్చింది హేమ.