Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 యేళ్ళ తరువాత రాములమ్మకి బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్...

ఒకప్పుడు చిరంజీవి, విజయశాంతి జంట అంటే మాస్‌కే కాదు క్లాస్‌కు కూడా పిచ్చ క్రేజ్. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో కలిసి నటించారు. వీరి జంట నటించిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కూడా నటించారు. ఆ తరువాత వీరిద్దరి జంట ఎక్క

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (19:21 IST)
ఒకప్పుడు చిరంజీవి, విజయశాంతి జంట అంటే మాస్‌కే కాదు క్లాస్‌కు కూడా పిచ్చ క్రేజ్. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో కలిసి నటించారు. వీరి జంట నటించిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కూడా నటించారు. ఆ తరువాత వీరిద్దరి జంట ఎక్కడా కనిపించలేదు. 
 
ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయశాంతి హీరోయిన్‌కు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. అయితే పాతికేళ్ళ తరువాత చిరంజీవి, విజయశాంతిల జంట మరోసారి తెరపైన కనిపించనుంది. సైరా నరసింహారెడ్డి సినిమాలో విజయశాంతి కీలక రోల్ చేయనున్నారు. రాజకీయంగా వీరి మధ్య వైరమున్నా వ్యక్తిగతంగా మాత్రం చిరుకి విజయశాంతి అంటే ఎంతో ఇష్టం. అందుకే సైరా నరసింహారెడ్డిలో విజయశాంతికి అవకాశం కల్పించారు చిరు. 
 
సైరాలో విజయశాంతి కనిపిస్తే ఒక కొత్త ట్రెండ్ స్టార్టవుతుంది. చిరు స్వయంగా ఫోన్ చేసి దర్శకుడు సురేందర్ రెడ్డిని కలవమని విజయశాంతికి చెప్పారట. చిరు చెప్పిన తరువాత సురేందర్ రెడ్డి కాదంటాడా. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే షూటింగ్‌కు నేరుగా వచ్చేయండని విజయశాంతికి చెప్పేశాడు దర్శకుడు. 2019 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments