Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్యకు తీరని కోర్కె... చిరు చిత్రంతో తీరుతుందా...?

నందమూరి బాలక్రిష్ణ. తెలుగు సినీ పరిశ్రమలో బాలక్రిష్ణకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అందులోను నందమూరి కుటుంబం అంటే.. అందులో ఉన్న వారెవరైనా సరే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. బాలక్రిష్ణ పౌరాణిక సినిమాలంటే అభిమానులు ఎంతో ఇష్టంతో చూస్తుంటారు. బ

Advertiesment
బాలయ్యకు తీరని కోర్కె... చిరు చిత్రంతో తీరుతుందా...?
, బుధవారం, 18 అక్టోబరు 2017 (15:45 IST)
నందమూరి బాలక్రిష్ణ. తెలుగు సినీ పరిశ్రమలో బాలక్రిష్ణకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అందులోను నందమూరి కుటుంబం అంటే.. అందులో ఉన్న వారెవరైనా సరే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. బాలక్రిష్ణ పౌరాణిక సినిమాలంటే అభిమానులు ఎంతో ఇష్టంతో చూస్తుంటారు. బాలక్రిష్ణ చెప్పే డైలాగులంటే ఎంతో ఆసక్తిగా వింటుంటారు. కానీ అలాంటి బాలక్రిష్ణకు ఒక కోరిక ఉంది. ఒక క్యారెక్టర్ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అదే విలన్ క్యారెక్టర్..
 
ఒక భారీ బడ్జెట్ మూవీలో విలన్‌గా చేయాలన్నది బాలక్రిష్ణ ఆలోచన. ఇప్పటివరకు రాని సినిమాలా ఉండాలి.. భారీ అంచనాలతో తెరకెక్కాలి. ఆషామాషీగా ఉండకూడదు. అలాంటి సినిమాలో విలన్‌గా చేయాలన్నది బాలక్రిష్ణ ఆలోచన. అందులో విలన్ పాత్ర భయానకంగా ఉండాలట. అది బాలక్రిష్ణకు తీరని కోరిక. ఈ కోరికను ఎవరు నెరవేరుస్తారా అని ఎదురుచూస్తున్నారు బాలక్రిష్ణ. 
 
ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే బాలక్రిష్ణను హీరోగా పెట్టి తీయాలని దర్శకులందరూ అనుకుంటారు. అలాంటిది విలన్‌గా బాలక్రిష్ణతో సినిమా అంటే ఎవరూ సాహసించరు. మరి బాలక్రిష్ణకు ఆ కోరిక తీర్చేది ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. ఐతే చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో విలన్ క్యారెక్టర్ చిరు క్యారెక్టరికి సమానంగా వుంటుందట. మరి అందులో బాలయ్య విలన్‌గా నటించే అవకాశం వుంటుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న చెర్రీ ''రంగస్థలం"