Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు పెరగడానికి కారణాలేంటో తెలుసా? ఒబిసిటీ నుంచి బయటపడాలంటే?

నిద్రలేదా..? మానసిక ఒత్తిడి పెరిగిపోతుందా? అయితే తప్పకుండా బరువు పెరిగిపోతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఒత్తిడికి గురైన సమయంలో అనాలోచితంగా జంక్‌ ఫుడ్‌ లేదా అధిక క్యాలోరీలను అందించే ఆహ

బరువు పెరగడానికి కారణాలేంటో తెలుసా? ఒబిసిటీ నుంచి బయటపడాలంటే?
, శుక్రవారం, 20 అక్టోబరు 2017 (11:42 IST)
నిద్రలేదా..? మానసిక ఒత్తిడి పెరిగిపోతుందా? అయితే తప్పకుండా బరువు పెరిగిపోతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఒత్తిడికి గురైన సమయంలో అనాలోచితంగా జంక్‌ ఫుడ్‌ లేదా అధిక క్యాలోరీలను అందించే ఆహారాలను తీసుకుంటారు. ఇలా తీసుకునే ఆహారం అధిక మొత్తంలో తీసుకుంటారు. అలాగే యాంటీ డిప్రెసెంట్‌లను తీసుకోవడం ద్వారా కూడా బరువు పెరగవచ్చు. 
 
అలాగే నిద్రలేమి ద్వారా శరీర బరువు పెరుగుతుంది. తగినంత నిద్రలేకపోవడంతో శరీరంలో హార్మోన్‌ల స్థాయుల్లో మార్పులు కలగడం వల్ల ఆకలి పెరుగుతుంది. తద్వారా అధికంగా తినేస్తుంటారు. తద్వారా ఒబిసిటీ తప్పదు. వ్యాయామాలు చేయకపోవటం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని అధికంగా తీసుకోవటం ద్వారా బరువు పెరిగిపోతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
బరువు తగ్గాలంటే.. ఉదయం పూట పరగడుపునే వ్యాయామం చేయడం ఉత్తమమని పరిశోధనలు తేల్చాయి. శరీరంలోని కణజాలాల్లోని జన్యువులు ఆహారం తిన్న గంటదాకా అందులోని శక్తిని తీసుకోవడానికే సమయం కేటాయిస్తాయట.
 
ఆ సమయంలో వ్యాయామం చేస్తే.. ఆ కండరాల్లో అందుకు తగ్గ ప్రభావమేదీ కనిపించదు. అదే ఆహారం తీసుకోకుండా వ్యాయామం చేస్తే.. ఈ కణజాల జీవక్రియలో చక్కటి మార్పులు కనిపించాయట. అందుకే ఆహారం తినకుండానే వ్యాయామం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక ముద్ద ఆహారం తీసుకుంటే 24 సార్లు నమలాలి.. సద్గురు