Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరాకు కలెక్షన్లు దంచుకోనున్న భగవంత్‌ కేసరి!

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (17:59 IST)
bhagawan kesari
ఈ దసరాకు బాలకృష్ణ, తమిళ విక్రమ్‌, రవితేజ సినిమాల పందెంలో దిగారు. అయితే భగవంత్‌ కేసరి మాత్రమే కలెక్షన్ల పరంగా ఆడియన్స్‌ ఆదరణ పరంగా ముందుంది. మొదట్లో టికెట్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ అయితే బాలకృష్ణ సినిమాకు పెద్దగా బుకింగ్‌ అవ్వలేదు. కానీ విజయ్‌ లియో సినిమాకు మాత్రం ఫుల్‌ బుకింగ్స్‌ అయ్యాయి. తమిళ సినిమాకు తెలుగులో కూడా అవ్వడంతో విశేషంగా చెప్పుకున్నారు.

ఇక, సినిమా విడుదలైన గురువారంనాడు భగవంత్‌ కేసరి సింగిల్‌ హ్యాండ్‌తో బాలకృష్ణ కథను నడిపాడు. ముఖ్యంగా కూతురు సెంటిమెంట్‌, మహిళాసాధికారత అంశం ప్రేక్షకులకు కనెక్ట్‌ అయింది. కొన్ని సినిమాటిక్‌ సన్నివేశాలున్నా సెంటిమెంట్‌బాగా వర్కవుట్‌ అయింది. విజయ్‌ లియో మాత్రం భారీ సినిమాతోపాటు నిడివి ఎక్కువ కావడంతో కథలో పెద్దగా పసలేకపోవడంతోపాటు వయెలెన్స్‌ భారీగా వుండడంతో నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దాంతో కలెక్షన్లు పడిపోయాయి.

ఇక శుక్రవారంనాడు విడుదలైన రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు కూడా డివైడ్‌ టాక్‌ వచ్చింది. కానీ అందులో పెద్దగా కామన్‌ మ్యాన్‌కు కనెక్ట్‌ కాకపోవడంతో మైనస్‌గా మారింది. ఇప్పటి తరానికి స్టువర్ట్‌పురం దొంగ కథను తీసుకుని సినిమాగా తీయాలనుకోవడం, ఫైనల్‌గా తను చాలా మంచివాడు అనే కోణంలో సినిమా వుండడంతో రాబిన్‌ హుడ్‌ తరహా కథను చూపించినట్లుంది. ఇందులోనూ భారీగా హింస వుండడంతో నెగెటివ్‌గా మారింది.

మొత్తంగా చూస్తే మూడు సినిమాల్లోనూ కావాల్సినంత వయెలెన్స్‌ వున్నా, కూతురు సెంటిమెంట్‌ కథ భగవంత్‌కే దసరా ప్రేక్షకులు ఓటు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల ఈసినిమాపై పూర్తి సంతృప్తిగా వుండడం విశేషం.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments